ETV Bharat / international

'భారతీయ అమెరికన్లకు ఇదో మేలుకొలుపు కావాలి' - అమెరికా

ఆన్​లైన్ శిక్షణ తీసుకుంటున్న విద్యార్థులను దేశం నుంచి పంపించే విధంగా అమెరికా తీసుకున్న నిర్ణయాన్ని నిపుణులు తప్పుబడుతున్నారు. ఈ నిర్ణయం వల్ల విద్యార్థులకే కాకుండా.. అమెరికాకు సైతం హానికలుగుతుందని పేర్కొన్నారు. అమెరికాలో ఉంటున్న భారతీయులకు ఈ నిర్ణయం ఓ మేలుకొలుపు కావాలని స్పష్టం చేస్తున్నారు.

Student visa changes part of Trump's racist immigration policy: Expert
'భారతీయ అమెరికన్లకు ఇదో మేలుకొలుపు కావాలి'
author img

By

Published : Jul 9, 2020, 4:50 PM IST

ఆన్​లైన్ శిక్షణ పొందుతున్న విద్యార్థులు దేశం విడిచి వెళ్లాలంటూ ట్రంప్ సర్కర్ చేసిన ప్రకటనపై తీవ్రంగా స్పందించారు స్టోనీ బ్రూక్ స్కూల్ ఆఫ్ జర్నలిజం విజిటింగ్ ప్రొఫెసర్ శ్రీ శ్రీనివాసన్. జాత్యహంకార వలస విధానంలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నారని విమర్శించారు. ఇలాంటి నిర్ణయాల ద్వారా విద్యార్థుల్లో గందరగోళం సృష్టిస్తున్నారని అన్నారు. ఈటీవీ భారత్​కు ఇచ్చిన ప్రత్యేక ముఖాముఖిలో పలు విషయాలపై చర్చించారు శ్రీనివాసన్.

శ్రీ శ్రీనివాసన్​తో ముఖాముఖి

మేలుకొలుపు కావాలి

అమెరికాలోని భారతీయ సమాజం కూడా ట్రంప్​ పట్ల భిన్నవైఖరితో ఉందని శ్రీనివాసన్ తెలిపారు. భారత సంతతి వ్యక్తులంతా కలిసి లేరని పేర్కొన్నారు. కొంతమంది ట్రంప్​కు మద్దతిస్తుంటే మరికొంతమంది వ్యతిరేకిస్తున్నారని చెప్పారు. వలసదారులకు వ్యతిరేకంగా తీసుకున్న నిర్ణయాలపై భారతీయులు పోరాడడాన్ని ప్రస్తావించారు. అధ్యక్షుడికి​ ఓటు బ్యాంకు కానప్పటికీ వీరంతా.. ట్రంప్​ను హానికరం కాని వ్యక్తిగానే పరిగణించారని గుర్తు చేశారు. వీరందరికీ ఈ నిర్ణయం ఓ మేలుకొలుపు కావాలని అన్నారు.

"ప్రస్తుతం పరిస్థితులు గందరగోళంగా ఉన్నాయి. ట్రంప్ ప్రభుత్వం చేసేది కూడా ఇదే. గందరగోళం సృష్టించడమే వారి ప్రధాన లక్షణం. జాత్యహంకారంతో పాటు ఇతర విధానాలను ఒకేసారి అమలు చేస్తున్నారు. వైద్యం, ఆర్థికం, జాతి వివక్షలో అమెరికా విఫలం కావడం మనం చూస్తున్నాం."

-శ్రీ శ్రీనివాసన్, విజిటింగ్ ప్రొఫెసర్, స్టోనీ బ్రూక్ స్కూల్ ఆఫ్ జర్నలిజం

ట్రంప్ ప్రభుత్వం వలసవాదానికి పూర్తిగా వ్యతిరేకంగా ఉందని దుయ్యబట్టారు శ్రీనివాసన్. ఇమ్మిగ్రేషన్ విధానాలు మెరుగ్గా ఉన్నాయి కాబట్టే ప్రజలు, విద్యార్తులు ఇక్కడి వచ్చి దేశానికి మేలు చేశారని అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం అమెరికాకు భారతీయ ఐఐటీ నిపుణులు అవసరం లేదని ట్రంప్ భావిస్తున్నారని పేర్కొన్నారు. ట్రంప్ నిర్ణయం వల్ల భారతీయులకే కాకుండా అమెరికాకు కూడా హాని కలిగిస్తుందని అన్నారు.

ఎన్నికల కోసమే ఇదంతా!

హెచ్​1బీ వీసాలు నిలిపివేయడం సహా ప్రస్తుతం తీసుకున్న నిర్ణయాలన్నీ ఈ ఏడాది ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే తీసుకుంటున్నారని అన్నారు. దేశంలోని వలసదారులు, మైనారిటీలను ట్రంప్.. శత్రువులుగా భావిస్తున్నారని పేర్కొన్నారు. తప్పుడు సమాచారం ద్వారా భయాందోళనలు పెంచుతుందన్నారని ధ్వజమెత్తారు.

రోజూ వందల మరణాలా!

కరోనా విషయంలోనూ ట్రంప్ విఫలమయ్యారని అన్నారు శ్రీనివాసన్. కరోనా తీవ్రంగా ఉన్న సమయంలో పాఠశాలలు, కళాశాలలు తెరవాలని బలవంతం చేయడాన్ని తప్పుబట్టారు.

"దక్షిణ కొరియా, అమెరికా దేశాల్లో ఒకేరోజు తొలి కరోనా కేసులు నమోదయ్యాయి. దక్షిణ కొరియాలో మొత్తం 200కు పైగా కరోనా మరణాలు సంభవిస్తే అమెరికాలో రోజూ వందల మంది మరణిస్తున్నారు. అమెరికాతో పోలిస్తే కొరియాలో 15 రెట్లు జనసాంద్రత ఎక్కువ."

ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి అమెరికా వైదొలగడంపై శ్రీనివాసన్ విచారం వ్యక్తం చేశారు. అయితే ట్రంప్ అధికారంలోకి వచ్చిన తొలి రోజు నుంచే తన ప్రణాళికలు అమలు చేస్తూ వచ్చారని... ప్రతిదీ బయటకు ప్రకటించిన తర్వాతే చేశారు కాబట్టి అందులో ఎలాంటి ఆశ్చర్యం లేదని అన్నారు.

సమస్య ఇది!

ఆన్​లైన్ శిక్షణ పొందుతున్న విద్యార్థులు దేశం విడిచి వెళ్లాలంటూ రెండు రోజు క్రితం అమెరికా ప్రభుత్వం ప్రకటన జారీ చేసింది. దీంతో అమెరికాలోని విదేశీ విద్యార్థుల పరిస్థితి గందరగోళంగా మారింది. ఈ నిర్ణయం వల్ల ప్రధానంగా చైనా, భారతదేశాలకు చెందిన విద్యార్థులపై తీవ్ర ప్రభావం పడనుంది. విశ్వవిద్యాలయాలు వచ్చే సెమిస్టర్లలో విద్యార్థులను రెగ్యులర్ కోర్సుల్లో చేర్చుకోకపోతే.. వారంతా అమెరికా విడిచి వెళ్లాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి పూర్తి మార్గదర్శకాలు ఇంకా రావాల్సి ఉంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.