ETV Bharat / international

టీచర్​పై ఐదేళ్ల విద్యార్థి దాడి.. ప్రాణాపాయంలో మహిళ - టీచర్​పై విద్యార్థి దాడి

Student Beating Teacher: టీచర్​పై ఓ ఐదేళ్ల విద్యార్థి దాడికి దిగాడు. చిన్నారి కొట్టిన దెబ్బల ధాటికి తీవ్రంగా గాయపడి స్పృహ కోల్పోయే స్థితికి చేరుకున్న ఆ మహిళ.. ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఇంతకీ అసలేం జరిగిందంటే..?

Student Beating Teacher
టీచర్​పై ఐదేళ్ల విద్యార్థి దాడి
author img

By

Published : Mar 8, 2022, 2:34 PM IST

Student Beating Teacher: అల్లరి చేసే విద్యార్థిని కంట్రోల్​ చేయడానికి టీచర్లు వాళ్లకు పనిష్మెంట్​ ఇవ్వడమో లేక మిగతా విద్యార్థుల నుంచి దూరంగా కూర్చోపెట్టడమో చేస్తారు. అయితే ఇలా చేయడం ఓ టీచర్​ ప్రాణాల మీదకు తెచ్చింది. క్లాస్​రూమ్​లో తెగ అల్లరి చేస్తున్నాడని ఓ ఐదేళ్ల చిన్నారిని ఆ టీచర్​ వేరే గదిలో కూర్చోపెట్టింది. అంతే.. ఆమె ఆ గదికి రాగానే మీద పడి దాడి చేశాడు ఆ చిన్నారి. దీంతో ఆమె పరిస్థితి విషమంగా మారింది.

అమెరికాలోని దక్షిణ ఫ్లోరిడాకు చెందిన పైన్స్​ లేక్స్​ ఎలిమెంటరీ స్కూల్​.. ప్రత్యేక అవసరాలు ఉన్న పిల్లల కోసం తరగతులు నిర్వహిస్తూ ఉంటుంది. దాడికి పాల్పడ్డ చిన్నారి కూడా అక్కడే శిక్షణ పొందుతున్నాడు. రోజూలాగే గత బుధవారం కూడా స్కూల్​కు వచ్చిన చిన్నారి.. క్లాస్​లో తెగ అల్లరి చేశాడు. చుట్టుపక్కల ఉన్న వస్తువులు అన్నీ చెల్లాచెదురుగా విసిరేసి.. కుర్చీలను పడేశాడు. దీంతో చిన్నారి అల్లరి కట్టడి చేయడానికి టీచర్​ అతడిని కూల్​డౌన్​ రూమ్​గా పేర్కొనే ప్రత్యేక గదికి తీసుకెళ్లి కూర్చోబెట్టింది.

అంతే.. కోపం పట్టలేని ఆ చిన్నారి టీచర్​పై దాడికి దిగాడు. మీద పడి చేతులతో కొడుతూ.. కాళ్లతో తంతూ, కరుస్తూ ఆమెపై విరుచుకుపడ్డాడు. విద్యార్థి ధాటికి తీవ్రంగా గాయపడిన ఆ మహిళ.. స్పృహ కోల్పోయే స్థితికి చేరుకుంది. స్థానికులు వచ్చి చూసేసరికి కదల్లేని స్థితిలో అక్కడే గోడకు చతికిలపడి కూర్చున్న ఆమెకు నోట మాట రాకుండా పోయింది. వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించగా.. విషమ పరిస్థితికి చేరుకున్న ఆమెకు వైద్యులు చికిత్స ప్రారంభించారు. ఆ ఉపాధ్యాయురాలికి శస్త్రచికిత్స నిర్వహించాల్సి ఉందని వెల్లడించారు.

ఈ ఘటనపై అధికారులు దర్యాప్తు చేపడుతున్నారు. అయితే చిన్నారి కావడం వల్ల ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశం లేదని పోలీసు శాఖ అధికార ప్రతినిధి పేర్కొన్నారు.

ఇదీ చూడండి : స్కూల్ పిల్లలపై పైశాచికం.. దుండగుడి కాల్పుల్లో ఒకరు మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.