ETV Bharat / international

భారతీయ విద్యార్థులకు యూఎస్​లో 'ప్రత్యేక' ఉద్యోగాలు!

అమెరికాలో చిక్కుకుపోయిన వేలాది మంది నాన్​-ఇమ్మిగ్రెంట్స్ వీసాల గడువును పొడిగించడానికి అగ్రరాజ్యం ముందడుగు వేసింది. అలాగే ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న విదేశీ విద్యార్థులు... చదువుకుంటూనే పార్ట్​ టైం ఉద్యోగాలు చేసుకునే విషయంలో మరింత వెసులుబాటు కల్పించింది. ఫలితంగా వేలాది మంది భారతీయులకు ఉపశమనం కలగనుంది.

Stranded foreign students can apply for off campus work authorisation: US
విద్యార్థులకు... యూఎస్​లో ఉద్యోగ అవకాశాలు!
author img

By

Published : Apr 15, 2020, 10:56 AM IST

కరోనా సంక్షోభం కొనసాగుతున్న వేళ అమెరికాలో చిక్కుకుపోయిన వేలాది మంది నాన్​-ఇమ్మిగ్రెంట్​ వీసాదారులకు ఊరట కలిస్తూ అగ్రరాజ్యం కీలక నిర్ణయం తీసుకుంది. వీరి వీసాల గడువును మరికొంత కాలం పొడిగించేందుకు... కేసుల ప్రాతిపదికన ప్రత్యేక పరిశీలన చేపట్టనున్నట్లు వెల్లడించింది.

వ్యాపారం లేదా పర్యటనలకు కోసం వెళ్లేవారికి బి-1, బి-2 వీసాలు; విద్యార్థులకు ఎఫ్-1 వీసాలు, పరిశోధకులు, వైద్యులు లాంటి వారికి జె-1 వీసాలు, ఐటీ నిపుణులకు హెచ్​1బీ వీసాలు, (ఇంట్రా కంపెనీ ట్రాన్సఫరీస్)​ ఎగ్జిక్యూటివ్ హోదా కలిగిన ఉద్యోగులకు ఎల్​-1 వీసాలు మంజూరు చేస్తారు. వీరంతా నాన్​-ఇమ్మిగ్రెంట్ వీసాదారులే అవుతారు.

దరఖాస్తు చేసుకోవాల్సిందే..

గడువు పొడిగింపు కోరుకునే వారు కచ్చితంగా దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరముందని యూఎస్ సిటిజన్​షిప్​ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (యూఎస్​సీఐఎస్​) స్పష్టం చేసింది. అన్ని హెచ్​1బీ వీసాల గడువును ప్రత్యేకంగా పొడిగించేది లేదని స్పష్టం చేసింది.

ఉద్యోగాలు చేసుకోవచ్చు..!

ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఒంటరి విదేశీ విద్యార్థులు ఆఫ్​ క్యాంపస్ వర్క్ ఆథరైజేషన్​ కోసం దరఖాస్తు చేసుకోవచ్చని అమెరికన్ ఫెడరల్ ఏజెన్సీ స్పష్టం చేసింది.

కరోనా ధాటికి గత కొన్ని వారాలుగా అమెరికా ఆంక్షల వలయంలో చిక్కుకుంది. ఈ నేపథ్యంలో వేలాది విదేశీ విద్యార్థులు ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీనితో రంగంలోకి దిగిన యూఎస్​సీఐఎస్... విదేశీ విద్యార్థులు చదువుకుంటూనే పార్ట్​ టైం ఉద్యోగాలు చేసుకునేందుకు మరింత వెసులుబాటు కల్పించింది. ఈ దరఖాస్తులను కూడా కేసుల వారీగా పరిశీలిస్తామని స్పష్టం చేసింది.

ఇదీ చూడండి: కరోనా వైరస్​ ఎటువంటి పరిస్థితుల్లో జీవించగలదో తెలుసా?

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.