ETV Bharat / international

అమెరికాలోని భారతీయ విద్యార్థులకు కేంద్రం కీలక సూచనలు - indian Ambassador Sandhu

కరోనా వ్యాప్తిని కట్టడి చేసేందుకు లాక్​డౌన్ విధించింది అమెరికా. ఈ నేపథ్యంలో అక్కడ చిక్కుకుపోయిన భారతీయులందరికీ కీలక సూచనలు చేసింది రాయబార కార్యాలయం. ఎవరూ ఆందోళన చెందవద్దని స్పష్టం చేసింది.

Indian students in US
'విద్యార్థులందరూ ఎక్కడి వాళ్లు అక్కడే ఉండండి'
author img

By

Published : Apr 12, 2020, 1:40 PM IST

Updated : Apr 12, 2020, 7:21 PM IST

అమెరికాలో కరోనా అంతకంతకూ తీవ్రమవుతున్న నేపథ్యంలో వైరస్ కట్టడికి లాక్​డౌన్​ విధించింది ప్రభుత్వం. యూనివర్సిటీలు సహా అన్నింటిని మూసివేసింది. ఈ కారణంగా అక్కడి భారత విద్యార్థులు కొందరు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వారిలోని 500 మంది విద్యార్థులతో అమెరికాలోని భారత రాయబార ప్రతినిధి తరణ్​జిత్​ సింగ్​ సంధు ఇన్​స్టాగ్రామ్​లో వీడియో సమావేశం నిర్వహించారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఎక్కిడివారు అక్కడే ఉండాలని సూచించారు. విద్యార్థులు ఎవరూ అందోళన చెందవద్దని స్పష్టం చేశారు. అమెరికా అధికారులతో తరచూ సంప్రదింపులు జరిపి సాయం అందించాలని కోరుతున్నట్లు చెప్పారు.

అమెరికాలో దాదాపు 2,50,000 మంది భారత విద్యార్థులు ఉన్నారని అంచనా. కరోనా వ్యాప్తి కారణంగా యూనివర్సిటీలు, హాస్టళ్లు మూసివేసి అందరినీ ఇంటికి వెళ్లమని అక్కడి ప్రభుత్వం అదేశించింది. అకస్మాతు చర్యతో ఎక్కడికి వెళ్లాలో తెలియక వందాలాది మంది విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పరిస్థితులు సాధారణమయ్యాక అందరినీ స్వదేశం రప్పించే ఏర్పాట్లు చేస్తామని తరణ్​జిత్​ సింగ్ భరోసా ఇచ్చారు.

అమెరికాలో కరోనా ప్రభావం మొదలైన వెంటనే భారత విద్యార్థుల కోసం ప్రత్యేక హెల్ప్​లైన్​ సెంటర్లను ఏర్పాటు చేసింది అక్కడి భారత రాయబార కార్యాలయం.

ఇదీ చదవండి: అమెరికా చరిత్రలోనే ఇలా చేయడం తొలిసారి!

Last Updated : Apr 12, 2020, 7:21 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.