ETV Bharat / international

భళా! 'స్పేస్​ ఎక్స్​'

సిబ్బంది సహిత వ్యోమనౌకను దిగ్విజయంగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి పంపగలిగింది 'స్పేస్​ ఎక్స్​' సంస్థ.

author img

By

Published : Mar 3, 2019, 8:02 PM IST

స్పేస్​ ఎక్స్​ ప్రయోగం

ప్రముఖ అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ 'స్పేస్​ ఎక్స్'​ మరో ఘనతను తన ఖాతాలో వేసుకుంది. ఆదివారం ముగ్గురు వ్యోమగాములతో సహా ప్రయోగించిన 'స్పేస్​ ఎక్స్​' వ్యోమనౌక దిగ్విజయంగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి చేరింది. కేవలం ఒక్క రోజులో వ్యోమనౌక గమ్యం చేరడం స్పేస్​ ఎక్స్​ చరిత్రలో ఓ మైలురాయిగా నిలిచిపోతుంది.

శనివారం స్పేస్​ ఎక్స్​ ప్రయోగించిన టెస్ట్​ ఫ్లైట్​లో కేవలం డమ్మీ మాత్రమే ఉంది. కానీ ఈ రోజు ప్రయోగించిన వ్యోమనౌకలో ముగ్గురు వ్యోమగాములను దిగ్విజయంగా పంపగలిగింది. దీంతో అంతరిక్షయానానికి వ్యోమగాములతో కూడిన స్పేస్​ క్రాఫ్ట్​ పంపడానికి ఎనిమిది సంవత్సరాలుగా చేస్తున్న కృషి ఫలించే సమయం వచ్చింది.

ఆరు రోజులపాటు నిర్వహించే ఈ ప్రయోగాలు విజయవంతమైతే, స్పేస్​ ఎక్స్​ ఈ వేసవిలోనే ఇద్దరు వ్యోమగాములతో తన మొట్టమొదటి వాణిజ్య వ్యోమనౌకను ప్రయోగించడానికి సిద్ధమవుతోంది. నాసా తలపెట్టిన వాణిజ్య అంతరిక్షయానంలో భాగంగా స్పేస్​ ఎక్స్ సంస్థ​ ఈ వ్యోమనౌకను పంపనుంది. దీనిలోని ఇద్దరు వ్యోమగాముల చర్యలను కాలిఫోర్నియాలోని స్పేస్​ ఎక్స్​ మిషన్​ కంట్రోల్​ నుంచి గమనించే అవకాశం ఉంది.

స్పేస్​ ఎక్స్​ ఇప్పటి వరకు ఎన్నో కార్గో వ్యోమనౌకలను విజయవంతంగా ప్రయోగించింది. కానీ వ్యోమగాములతో కూడిన అంతరిక్షయానం పూర్తిగా భిన్నమైనది. ఈ వ్యోమనౌక 'స్పేస్​ ఎక్స్​ అంతరిక్ష కేంద్రం' సహాయం అవసరం లేకుండానే పూర్తి స్వతంత్రంగా పనిచేస్తుండటం విశేషం.

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.