అంతరిక్ష ప్రయోగ సంస్థ స్పేస్‌ఎక్స్(SpaceX news) శనివారం విజయవంతంగా 53 ఉపగ్రహాలను రోదసిలోకి పంపింది. ఫాల్కన్-9 రాకెట్ ద్వారా అమెరికా ఫ్లోరిడాలోని కేప్ కెనావెరాల్ అంతరిక్ష కేంద్రం నుంచి ఈ ప్రయోగం జరిగింది.
ప్రయోగానంతరం ఈ రాకెట్.. తిరిగి క్షేమంగా భూమికి తిరిగొచ్చింది. తాజాగా ప్రయోగించిన వాటిలో 53 ఉపగ్రహాలు 'స్టార్‌లింక్' ప్రాజెక్టుకు సంబంధించినవి. భూమిపై విస్తృత స్థాయిలో బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్ సంధానత ఇవ్వడం దీని ఉద్దేశం. 2018 ఫిబ్రవరిలో ఈ ప్రాజెక్టు ప్రారంభమైంది. దీని కింద మొత్తం 12వేల ఉపగ్రహాలను ప్రయోగించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
-
Deployment of 53 Starlink satellites confirmed pic.twitter.com/bnYtOqUUfC
— SpaceX (@SpaceX) November 13, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">Deployment of 53 Starlink satellites confirmed pic.twitter.com/bnYtOqUUfC
— SpaceX (@SpaceX) November 13, 2021Deployment of 53 Starlink satellites confirmed pic.twitter.com/bnYtOqUUfC
— SpaceX (@SpaceX) November 13, 2021
ఇటీవలే స్పేస్ ఎక్స్ వ్యోమనౌక.. నలుగురు వ్యోమగాములను అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోకి తీసుకెళ్లింది. ఇందులో 600వ వ్యక్తి రోదసి యాత్రకు వెళ్లినట్లు నాసా వర్గాలు తెలిపాయి.
ఇదీ చదవండి: