ETV Bharat / international

బైడెన్‌ హయాంలో వలస విధానాల్లో భారీ మార్పులు ? - వలస విధానాలను ప్రక్షాళన

రసవత్తరంగా సాగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన జో బైడెన్‌... ఏ తరహా విధాన నిర్ణయాలు తీసుకుంటారన్నది సర్వత్రా ఆసక్తి కలిగిస్తోంది. వలస విధానంలో విప్లవాత్మక మార్పులు తథ్యమని కొందరు వాదిస్తోంటే.. ట్రంప్‌ వివాదాస్పద నిర్ణయాలన్నింటినీ బైడెన్‌ అటకెక్కిస్తారని మరికొందరు చెబుతున్నారు. ఇంతకీ బైడెన్‌ ప్రభుత్వం ఎలాంటి విధానాలు అనుసరించనుంది ? వలసజీవుల జీవితాల్లో ఎటువంటి మార్పులు రానున్నాయి ?

under Biden
బైడెన్‌ హయాంలో వలస విధానాల్లో భారీ మార్పులు ?
author img

By

Published : Nov 11, 2020, 2:28 PM IST

ట్రంప్‌ విధానాలను బలంగా వ్యతికరేకించి.. తమ పార్టీ ఆలోచనలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లారు జో బైడెన్‌. ట్రంప్‌ నిర్ణయాలకు వ్యతిరేకంగా ప్రచారం సాగించటమే బైడెన్‌కు కలిసొచ్చిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో.. డెమొక్రాట్‌ నేత అధికారం చేపట్టిన వెంటనే గత ప్రభుత్వం తీసుకున్న పలు కీలక నిర్ణయాలను పక్కనబెట్టే అవకాశం కనిపిస్తోంది.

జో బైడెన్‌.. అక్రమంగా అమెరికాకు వలస వచ్చిన వారికి రక్షణ కల్పించే ఆలోచనలో ఉన్నారు. అదే సమయంలో వివాదాస్పద 'మెక్సికన్‌ గోడ'కు నిధులు నిలిపివేసే సూచనలు కనిపిస్తున్నాయి. వలసలకు సంబంధించి డెమొక్రాట్లు ఇప్పటికే స్పష్టమైన విధానాలను రూపొందించుకున్నారు. అయితే, ట్రంప్‌ సర్కార్‌ నిర్ణయాలను పక్కనపెట్టేందుకు కొంత సమయం పట్టనుంది. కారణం, కాంగ్రెస్‌లో రిపబ్లికన్లు ఆధిపత్యం చెలాయిస్తుండటమే.

ఇదీ చూడండి: పరిపాలన సన్నద్ధతలో బైడెన్​- న్యాయపోరాటంలో ట్రంప్​!

ట్రంప్‌ ఉక్కుపాదం

అమెరికా 45వ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌.. వలసల పట్ల చాలా కఠినంగా వ్యవహరించారు. ముఖ్యంగా మెక్సికన్‌ వలసలపై ఉక్కుపాదం మోపారు. కొన్ని ముస్లిం దేశీయుల ప్రయాణాల పట్ల ఆంక్షలు విధించారు. సాధారణ వలసలు సైతం ప్రభావితమయ్యే విధానాలు తీసుకొచ్చారు. కాందీశీకుల సంఖ్య దాదాపు 80% తగ్గించారు.

వలసలపై బైడెన్‌ మాట..

ఎన్నికల ప్రచారంలోనే బైడెన్‌.. ట్రంప్‌ నిర్ణయాలపై నిప్పులు చెరిగారు. వలసదారులు నేటి అమెరికా నిర్మాణంలో కీలకంగా వ్యవహరించారని గుర్తు చేశారు. అయితే, ప్రస్తుతం బైడెన్‌ పాలనా ప్రాథమ్యాల్లో వలస విధానాల్లో మార్పులకు ముందు.. కరోనా, ఆర్థిక వ్యవస్థ, జాత్యాంహంకారం, వాతావరణ మార్పులు వంటి అంశాలున్నాయి. ఈ తరుణంలో ఒబామా హయాంలో వలస విధానాల సలహాదారుగా ఉన్న సిసిలియా మ్యూనోజ్‌ను బైడెన్‌ తన బృందంలో చేర్చుకోవటం చర్చనీయాంశమైంది.

ప్రక్షాళనే పరమావధి..

  • బైడెన్‌ మొదటి నుంచి ట్రంప్‌ వలస విధానాలను ప్రక్షాళన చేస్తామని చెబుతున్నారు.
  • ట్రంప్‌ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మెక్సికన్‌ సరిహద్దు గోడకు నిధులు ఆపేసే ఆలోచనలో ఉన్నారు.
  • డిఫర్డ్‌ యాక్షన్ ఫర్‌ చైల్డ్‌హుడ్‌ కార్యక్రమాన్ని తిరిగి ప్రారంభించే యోచన చేస్తున్నారు. ఇది చిన్నతనంలో అమెరికాకు వలస వచ్చిన 6,50,000 మందికి బహిష్కరణ నుంచి రక్షణ కల్పిస్తుంది.
  • ప్రస్తుతం 'ట్రావెల్‌ బ్యాన్‌' కొనసాగుతున్న 13దేశాల పౌరులను అమెరికాలోకి అనుమతించనున్నారు.
  • ట్రంప్‌ అధికారంలోకి రాగానే.. అక్రమ వలసదారులందరనీ వెనక్కి పంపించేయాలంటూ కటువుగా వ్యవహరించారు. బైడెన్‌ మాత్రం.. ఒబామా అనుసరించినట్లుగా నేరస్థులను మాత్రమే తిరిగి పంపించాలని భావిస్తున్నారు.
  • అదే సమయంలో తల్లిదండ్రుల నుంచి దూరమైన వలసదారుల పిల్లలను కలిపే ఆలోచన చేస్తున్నారు.
  • మెక్సికన్ వలస విధానాల పట్ల కాస్త ఆచితూచి వ్యవహరించాలని నిర్ణయించారు.

నిర్ణయాలకు సమయం

అయితే, ట్రంప్‌ హయాంలో తీసుకున్న కీలక నిర్ణయాలు చాలావరకు న్యాయస్థానాల్లో పెండింగ్‌లో ఉన్నాయి. ఇవి కొలిక్కివచ్చే వరకు బైడెన్‌ విధానాలు మార్చలేని పరిస్థితి. అదే సమయంలో ఉదారంగా వ్యవహరిస్తే వలసలు భారీగా పెరిగిపోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి.. విధివిధానాల రూపకల్పనలో బైడెన్‌ ‌ప్రభుత్వం అప్రమత్తంగా వ్యవహరిస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

గ్రీన్‌కార్డుల విషయంలో అనేక చిక్కుముడులు ఉన్నందున.. కీలక నిర్ణయాలకు మరింత సమయం పట్టే ఆస్కారముంది. ప్రస్తుతానికి బైడెన్‌ ప్రభుత్వం వలసదారులకు తాత్కాలిక రక్షణ కల్పించే అంశంపై ప్రధాన దృష్టి సారించనుంది.

ప్రస్తుతం ట్రంప్‌ దారే..

ప్రస్తుతం కరోనా సంక్షోభం నేపథ్యంలో.. అక్రమ వలసదారులను దేశం సరిహద్దుల నుంచే వెనక్కి పంపించేయాలన్న ట్రంప్‌ సర్కార్‌ నిర్ణయాన్ని బెైడెన్‌ ప్రభుత్వం కొనసాగించే సూచనలు కనిపిస్తున్నాయి. వైరస్‌ వ్యాప్తి, అధికారుల ఆరోగ్యం దృష్టిలో పెట్టుకుని.. కాస్త కఠినంగానే వ్యవహరించే అవకాశాలున్నాయి. కరోనా కల్లోలం అంతమయ్యేవరకు వలస విధానాలపై బైడెన్‌ సైతం ట్రంప్‌నే అనుసరించనున్నారు.

ఇదీ చూడండి: బైడెన్​ సమీక్షా బృందాల్లో 20 మంది భారతీయులు

ఇదీ చూడండి: బైడెన్​ ప్రభుత్వంలో కమల భర్త ఏం చేస్తారంటే..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.