ETV Bharat / international

స్మార్ట్​ఫోన్​ కెమెరాతో కరోనా ఆనవాళ్లను పట్టేయొచ్చు! - కరోనా వైరస్ వార్తలు

నిమిషాల్లో కరోనా ఆనవాళ్లను కనిపెట్టే పరికరాన్ని అమెరికా ఇల్లినాయిస్ విశ్వవిద్యాలయం పరిశోధకులు రూపొందించారు. స్మార్ట్ ఫోన్​ సాయంతో పనిచేసే ఈ సాధనం వ్యాధికారక వైరస్, బ్యాక్టీరియాలను 30 నిమిషాల్లో కనిపెట్టేయొచ్చని చెబుతున్నారు నిపుణులు.

PATHTRACKER
స్మార్ట్​ఫోన్​ కెమెరా
author img

By

Published : Apr 28, 2020, 8:51 AM IST

కరోనా ఆనవాళ్లను కనిపెట్టేందుకు పరిశోధకులు పాత్‌ట్రాకర్‌ అనే సరికొత్త సాధనాన్ని సృష్టించారు. ఇది స్మార్ట్‌ఫోన్‌ సాయంతో పనిచేస్తుంది. వ్యాధికారక వైరస్‌లు, బ్యాక్టీరియాలను ఈ పరికరంతో 30 నిమిషాల్లో కనిపెట్టేయొచ్చు.

సుమారు 3,800 ధర చొప్పున దొరికే ఈ పరికరాల వినియోగం వల్ల పరీక్ష ల్యాబ్‌లపై ఒత్తిడి తగ్గుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. అమెరికాలోని ఇల్లినాయిస్‌ యూనివర్సిటీ ప్రొఫెసర్‌ బ్రియాన్‌ కన్నింగ్‌హాం నేతృత్వంలోని బృందం దీనిని రూపొందించింది.

ఇలా గుర్తిస్తారు..

పరీక్ష కారకాల క్యాట్రిడ్జ్‌తో కూడిన పాత్‌ట్రాకర్‌ లోపల ఓ చిన్నపోర్టు ఉంటుంది. అనుమానిత వ్యక్తి నుంచి సేకరించిన స్వాబ్‌ కానీ రక్త నమూనాను కానీ ఆ పోర్టులో ఉంచుతారు. క్యాట్రిడ్జ్‌ లోపల ఉండే కారకాలు... వైరస్‌ల పైభాగాన్ని పగులగొట్టి ఆర్‌ఎన్‌ఏను సేకరిస్తాయి. అందులో ప్రాథమికంగా లభించే అణువు 15 నిమిషాల్లో లక్షల సంఖ్యలో జన్యు పదార్థాలుగా మారిపోతుంది.

కెమెరాతో గుర్తించవచ్చు..

ఫ్లోరోసెంట్‌ రంగు మరకల్లా ఉండే ఆ జన్యు పదార్థాలపై నీలిరంగు లెడ్‌ వెలుతురు పడితే అవి ఆకుపచ్చ రంగులోకి మారతాయి. వీటిని స్మార్ట్‌ఫోన్‌లోని కెమెరా ద్వారా గుర్తించవచ్చు. పాత్‌ట్రాకర్‌పై ఉండే క్లిప్‌తో దానిని స్మార్ట్‌ఫోన్‌తో అనుసంధానించుకోవచ్చు. విమానాలు ఎక్కబోయే ముందు ప్రయాణికులకు, వివిధ కార్యక్రమాల ప్రారంభానికి ముందు ఆహ్వానితులకు ఈ పాత్‌ట్రాకర్‌ ద్వారా త్వరితగతిన పరీక్షలు చేయవచ్చునని కన్నింగ్‌హాం చెప్పారు.

ఇదీ చూడండి: కోలుకున్నాక కరోనా తిరగబెడుతోందా.. అందులో నిజమెంత?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.