అమెరికాలోని వేర్వేరు ప్రాంతాల్లో కాల్పుల కలకలం రేగింది. ఈ ఘటనలో పలువురు మృతిచెందారు, అనేకమంది గాయపడ్డారు.
పార్టీలో..
సౌత్ న్యూ జెర్సీలోని ఓ ఇంట్లో పార్టీ జరగగా.. అందులో కాల్పుల మోత మోగింది. ఈ ఘటనలో ఇద్దరు మరణించారు. మరో 12మంది గాయపడ్డారు. మృతుల్లో ఓ మహిళ ఉన్నట్టు తెలుస్తోంది.
బార్ బయట..
ఓహియోలో యంగ్స్టౌన్లోని ఓ బార్ బయట ఆగంతుకుడు కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా, మరో ముగ్గురు గాయపడ్డారు.
స్థానిక కాలమానం ప్రకారం ఆదివారం ఉదయం 2గంటలకు ఈ ఘటన జరిగింది. దీనికి సంబంధించి పోలీసులు ఇంకా ఎవరినీ అదుపులోకి తీసుకోలేదు. విచారణ చేపట్టినట్టు వెల్లడించారు.
ఇదీ చూడండి:- బస్సుపై 70 రౌండ్ల కాల్పులు- ఇద్దరు మృతి