అమెరికాలోని ఉత్తర ఇదాహోలో ఘోర ప్రమాదం జరిగింది. ఓ చెరువుపై రెండు విమానాలు ఢీకొన్నాయి. ఈ ఘటనలో 8మంది దుర్మరణం పాలయ్యారు. వీరిలో ముగ్గురు చిన్నారులు ఉన్నట్టు కూటినై కౌంటీ అధికారి తెలిపారు.
రెండు విమానాల్లో ఒకటి ఫ్లోట్ ప్లేన్. ఇది కౌర్ డి అలేనేకు చెందిన బ్రూక్స్ సీప్లేన్స్ సంస్థకు చెందింది. ఇందులో పైలట్, ముగ్గురు చిన్నారులు సహా ఐదుగురు ప్రయాణికులు ఉన్నారు. మరొక విమానం సెస్నా 206.
ఈ ఘటనకు సంబంధించి ఇప్పటివరకు ముగ్గురి మృతదేహాలను వెలికితీశారు. పూర్తి వ్యవహారంపై దర్యాప్తు కొనసాగుతోంది.
ఆదివారం జరిగిన ఈ ఘటనలో.. ఆకాశంలో రెండు విమానాలు ఒకదానిని మరొకటి ఢీకొని.. అనంతరం వందల మీటర్ల ఎత్తు నుంచి చెరువులోకి పడ్డాయని ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు.