అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అభిశంసన విచారణ ప్రతినిధుల సభ నుంచి ఎగువ సభ సెనేట్‌కు చేరింది. ట్రంప్ అభిశంసన విచారణపై సెనేట్‌లో మంగళవారం ఈ చర్చ ప్రారంభమైంది. ఛాంబర్ నాయకుడు మిచ్ మెక్కానెల్ విచారణ ప్రక్రియ నియమాలలో మార్పులు చేశారని డెమోక్రాట్లు ఆరోపించారు.
మొదటి దశకు చెందిన సాక్ష్యులు, సాక్ష్యాలపై కఠిన ఆంక్షలు విధించే నియమాలను రిపబ్లికన్ పార్టీ సభ్యుడు మెక్కానెల్ ప్రతిపాదించారు. విచారణను త్వరగా ముగించాలని కోరారు. నియమాలను మార్చేందుకు డెమోక్రాట్ సభ్యులు చేసే ప్రయత్నాలను అడ్డుకుంటామని మెక్కానెల్ ఈ సందర్భంగా తెలిపారు.
ఇదీ చూడండి: 'ట్రంప్ అభిశంసన'లో చీఫ్ ఆఫ్ స్టాఫ్‌కు సమన్లు