ETV Bharat / international

ప్రపంచంపై కరోనా 2.0 విలయతాండవం సృష్టించనుందా?

కరోనా మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా మహా విలయం సృష్టిస్తోంది. లక్షలాది ప్రాణాలను బలితీసుకుంది. అనేక దేశాల ఆర్థిక వ్యవస్థల్ని ఛిన్నాభిన్నం చేస్తోంది. ఈ క్రమంలో ఆర్థిక వ్యవస్థను కాపాడుకునేందుకు అనేక దేశాలు లాక్‌డౌన్‌ను ఎత్తేస్తున్నాయి. ఆర్థిక కార్యకలాపాలకు అనుమతినిస్తున్నాయి. అయితే శాస్త్రవేత్తలు మాత్రం మరోసారి ఆ వైరస్ మానవాళిపై పంజా విసిరే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. వందేళ్ల క్రితం అమెరికాలో రెండోసారి విజృంభించిన స్పానిష్‌ ఫ్లూ విలయాన్ని గుర్తు చేస్తున్నారు.

Second virus wave: How bad will it be as lockdowns ease?
మరోసారి కరోనా విలయతాండవం సృష్టించనుందా?
author img

By

Published : May 7, 2020, 6:23 AM IST

Updated : May 7, 2020, 7:08 AM IST

యావత్ ప్రపంచం కొవిడ్‌-19పై యుద్ధాన్ని ప్రకటించాయి. వారాల తరబడి తమని తాము ఇంట్లోనే నిర్బంధించుకొని భౌతికదూరం అనే అస్త్రంతో కరోనాపై రణం చేస్తూ వచ్చాయి. ఈ క్రమంలోనే ఎక్కడిక్కడ వాణిజ్యం, వ్యాపారాలు నిలిచిపోయి ఆర్థికపరమైన సవాళ్లు ప్రపంచదేశాల ముందు నిలిచాయి. ఈ పరిస్థితుల్లో కరోనాతో సహజీవనం చేస్తూ ముందుకు సాగుతూ ఆర్థిక వ్యవస్థని కాపాడుకుందామంటూ.. ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకుంటున్నాయి. పరిశోధకులు మాత్రం మరోసారి కరోనా విజృంభించే అవకాశాలు లేకపోలేదని.. ఆ విజృంభణ ఊహకైనా అందనంత విలయం సృష్టిస్తుందని హెచ్చరిస్తున్నారు.

అమెరికాలో..

అగ్రరాజ్యం అమెరికాలో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. కరోనా వ్యాప్తితో పాటు మరణాల రేటు కూడా అధికంగా ఉంది. అయినప్పటికీ దాదాపు అన్ని రాష్ట్రాలు ఆర్థిక వ్యవస్థలను కాపాడుకోవడం కోసం లాక్‌డౌన్‌ను ఎత్తేస్తున్నాయి. వ్యాపారాలకు అనుమతులు ఇస్తున్నాయి. అగ్రరాజ్యం వాణిజ్య రాజధాని న్యూయార్క్‌లో వైరస్​ వ్యాప్తి సహా.. మరణాలూ అధికంగానే ఉన్నాయి. అయితే న్యూయార్క్ వెలుపల గ్రామాల్లో కూడా అధికంగా ఉందని.. న్యూయార్క్ నీడలో వాటికి అంత ప్రాధాన్యం లేకుండా పోయిందని విశ్లేషకులు చెబుతున్నారు. ఇప్పటికీ వైరస్ తమను వదల్లేదని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కాన్సాస్‌లోని షావ్‌నీ కౌంటీ వైద్యాధికారి చెప్పారు.

ఆర్థిక వ్యవస్థమీదే ధ్యాస

అమెరికాలో కరోనాతో 71 వేలకు పైగా మరణాలు సంభవించగా 12 లక్షల మందికి పైగా వైరస్ బారిన పడ్డారు. మరోసారి అమెరికా అధ్యక్ష పీఠంపై కూర్చోవడమే ఏకైక ధ్యేయంగా ఉన్న డొనాల్డ్ ట్రంప్‌.. లాక్‌ డౌన్‌ సడలింపులకు ప్రాధాన్యం ఇవ్వడం సహా ఆర్థిక వ్యవస్థమీదే దృష్టిసారిస్తున్నారు. గడచిన రెండు నెలల వ్యవధిలో అమెరికాలో దాదాపు 3 కోట్ల మంది తమ ఉద్యోగాలు కోల్పోయారు. త్వరలో ఎన్నికలు జరగనున్న వేళ.. వందేళ్ల క్రితం స్పానిష్ ఫ్లూ సృష్టించిన బీభత్సంపై అందరూ చర్చించుకుంటున్నారు. నాడు రెండోసారి స్పానిష్ ఫ్లూ పుట్టుకురాగా.. అప్పుడు అమెరికాలోని అనేక రాష్ట్రాల్లో సమావేశాలకు అనుమతులు ఇవ్వడం జరిగింది. ఈ క్రమంలో విజృంభించిన ఫ్లూ.. మొదటిసారి కంటే రెండోసారి ఎక్కువ నష్టాన్ని మిగిల్చింది.

నిపుణులు ఏమంటున్నారంటే?

కొవిడ్ ధాటికి ఐరోపా కకావికలమైంది. ఆ ఖండంలోని అన్ని దేశాలూ ఆ మహమ్మారి బారినపడ్డాయి. తొలుత ఇటలీలో మొదలైన మరణమృదంగం.. తర్వాత స్పెయిన్‌, ఫ్రాన్స్‌ సహా ఇప్పుడు బ్రిటన్‌లో మృత్యుఘంటికలు మోగించింది. ఈ క్రమంలో ఇటలీలో లాక్‌డౌన్ ఆంక్షలు సడలించడంపై ప్రభుత్వాధినేతలను శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. కొత్త బాధితులను గుర్తించి వైరస్‌ మరోసారి వ్యాప్తి చెందకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. కొత్తగా వచ్చే కేసులు గుర్తించేందుకు శిక్షణ అవసరమని అందుకోసం ఎక్కువ మొత్తంలో నిధులు కేటాయించాలని ఇటలీ సర్కార్‌కి విజ్ఞప్తి చేస్తున్నారు. చాలా దేశాలు యాప్‌లను రూపొందించుకొని సాంకేతికత సాయంతో కరోనాని కట్టడి చేయాలని ప్రయత్నిస్తున్నాయని.. అది మాత్రమే మరోసారి వైరస్ విజృంభించకుండా అడ్డుకోవడానికి సరిపోదని ఇటలీ నిపుణులు అంటున్నారు.

ఆంక్షలు ఎత్తేసిన జర్మనీ..

ఐరోపా కూటమిలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన జర్మనీ.. కరోనా ఆంక్షలను ఎత్తేసి ఆర్థిక కార్యకలాపాలకు అవకాశం కల్పించింది. అయితే ప్రజలు భౌతికదూరం సహా మార్గదర్శకాలు పాటించకుంటే మళ్లీ కఠినమైన ఆంక్షలు విధించాల్సి ఉంటుందని జర్మనీ ఛాన్సలర్‌ ఏంజెలా మెర్కెల్ హెచ్చరించారు. ఈ మేరకు 16 రాష్ట్రాల గవర్నర్లతో సమావేశంలో ఆమె స్పష్టం చేశారు. జర్మనీ కూడా రెండోసారి కొవిడ్ వచ్చే అవకాశాలు కొట్టి పారేయలేమని అంటోంది. అయితే అది ఏ స్థాయిలో ఉన్నా సమర్థంగా ఎదుర్కొని తీరుతామని అధికారులు అంటున్నారు. జర్మనీలో ఇటలీ, బ్రిటన్‌లతో పోల్చితే కరోనా మరణాల రేటు అతి తక్కువగా ఉంది.

ఐరోపాలో..

ఐరోపాలోనే ఎక్కువ మరణాలు చోటుచేసుకున్న బ్రిటన్‌.. కరోనా బాధితుల కాంటాక్ట్స్‌ను గుర్తించేందుకు 18 వేల మందిని నియమించుకొని వారికి శిక్షణ ఇస్తోంది. రెండోసారి ఈ కరోనా విజృంభిస్తే వారిని కట్టడి చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటోంది. దక్షిణ కొరియా స్ఫూర్తితో ఎక్కువ పరీక్షలు చేయించాలని.. బాధితులతో సన్నిహితంగా ఉన్న వారిని ఐసోలేషన్‌లో ఉంచాలని నిర్ణయించింది. ఇజ్రాయెల్ కూడా లక్షకు పైగా ర్యాపిడ్ యాంటీబాడీ టెస్టులు నిర్వహించి కరోనా తీవ్రతపై ఓ అంచనాకు రావాలని నిర్ణయించింది.

బ్రెజిల్ ఇప్పటికే మనౌస్‌లో లాక్‌డౌన్ విధించింది. ప్రజలందరూ సహకరించాలని విజ్ఞప్తి చేసింది.

భారత్​లో కలవరం..

భారత్‌లో మరోసారి లాక్‌డౌన్ ఆంక్షలు సడలించిన మరుసటి రోజే తమిళనాడు కోయంబేడులోని అతి పెద్ద మార్కెట్‌లో భారీ ఎత్తున కరోనా కేసులు వెలుగుచూడడం కలవరం పుట్టిస్తోంది. ఆ మార్కెట్‌ను మూసేసిన అధికారులు దాదాపు 7 వేల మందిని ఐసోలేషన్‌లో ఉంచారు.

ఇదీ చదవండి: 'అమెరికాలో అక్టోబర్​లోనే కరోనా కేసు నమోదు!'

Last Updated : May 7, 2020, 7:08 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.