అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్‌ల రెండో భేటీకి వియత్నాం వేదిక కానుంది. వియత్నాం రాజధాని హనోయ్ లేదా దా నాంగ్ నగరంలో ఫిబ్రవరి 27, 28 తేదీల్లో ఇరువురి మధ్య చరిత్రాత్మక సమావేశం ఉండనుంది. ఈ సమావేశంలో అణ్వాయుధాలు, క్షిపణి పరీక్షల ఉపసంహరణపై దౌత్యపరమైన చర్చలు జరపనున్నారు.
వాషింగ్టన్లో జాతినుద్దేశించి ప్రసంగించిన ట్రంప్ ఈ భేటీ వివరాలు ప్రకటించారు. కొరియా అధ్యక్షుడు కిమ్‌తో సంబంధాలు సానుకూలంగా ఉన్నాయని పేర్కొన్నారు.
ట్రంప్, కిమ్‌లు గతేడాది సింగపూర్‌లో మొదటిసారిగా సమావేశమయ్యారు. ఈ చారిత్రక సమావేశంలో అణ్వాయుధాల ఉపసంహరణకు సంబంధించి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.