ETV Bharat / international

కరోనా రోగుల్లో 3 నెలల పాటు యాంటీబాడీలు!

author img

By

Published : Oct 9, 2020, 5:27 PM IST

కరోనా వైరస్​ను నిరోధించే యాంటీబాడీలు.. బాధితుల రక్తం, లాలాజలంలో 3 నెలల పాటు ఉంటాయని గుర్తించారు పరిశోధకులు. అమెరికా హార్వర్డ్​ మెడికల్​ స్కూల్​ శాస్త్రవేత్తలు దీనిపై అధ్యయనం చేశారు. ఇందులో ఓ భారత సంతతి వ్యక్తి కూడా ఉన్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​కు చికిత్సలో వినియోగించిన రీజెనరాన్​ యాంటీబాడీ డ్రగ్​ ఆశాజనక ఫలితాలిస్తున్నట్లు వెల్లడించారు వైద్య నిపుణులు. అయితే.. ఇది ఇంకా ప్రయోగ దశలోనే ఉంది.

Scientists detect long-lived antibodies in blood, saliva samples from COVID-19 patients
కరోనా రోగుల్లో 3 నెలల పాటు యాంటీబాడీలు!

కరోనా సోకిన రోగుల్లో యాంటీబాడీలు కనీసం మూడు నెలల వరకు ఉంటాయని శాస్త్రవేత్తలు గుర్తించారు. అమెరికాలోని హార్వర్డ్​ మెడికల్​ స్కూల్​కు చెందిన శాస్త్రవేత్తలు సహా పలువురు పరిశోధకులు ఈ మేరకు జర్నల్​ సైన్స్​లో వ్యాసం రాశారు. 343 మంది కరోనా రోగుల్లోని రక్తంలో ఉన్న యాంటీబాడీల కదలికలను వైరస్​ లక్షణాలు తేలిన తర్వాత 122 రోజుల పాటు పరిశీలించి పరిశోధకులు ఈ విషయాన్ని తేల్చారు. వైరస్​ నిర్ధరణలో.. ప్రత్యామ్నాయ పరీక్షా విధానానికి తాజా పరిశోధన దోహదం చేయనుంది.

యాంటీబాడీ పరీక్ష కోసం లాలాజలాన్ని ప్రత్యామ్నాయ బయో ఫ్లూయిడ్​గా వినియోగించవచ్చని పరిశోధకులు తెలిపారు. యాంటీబాడీలను ఐజీజీ, ఐజీఏ, ఐజీఎంలుగా వర్గీకరించిన పరిశోధకులు వీటిలో ఐజీజీ రకం యాంటీబాడీ(95 శాతం) రక్తం, లాలాజలంలో ఎక్కువకాలం ఉంటుందని గుర్తించారు.

రీజెనరాన్​ గురించి అప్పుడే చెప్పలేం..

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​కు చికిత్సలో​ వినియోగించిన రీజెనరాన్​ యాంటీబాడీ డ్రగ్ వంటి వాటితో కరోనా నుంచి కోలుకుంటారని కచ్చితంగా చెప్పలేమని అంటున్నారు వైద్య నిపుణులు. కానీ.. కొవిడ్​ లక్షణాలు తగ్గడంలో ఆశాజనక ఫలితాలిస్తున్నట్లు వెల్లడించారు. ఈ ఔషధాలు ఇంకా ప్రయోగదశలోనే ఉన్నాయి. డ్రగ్​ సురక్షితమేనా, ప్రభావవంతంగా పనిచేస్తుందా అనేది స్పష్టంగా తెలియదు.

తనకు అందించిన ఔషధాల్లో రీజెనరాన్‌ యాంటీబాడీ డ్రగ్‌ బాగా పనిచేసిందని ట్రంప్‌ అన్నారు. దాని వల్లే కోలుకున్నానని వ్యాఖ్యానించారు. స్వర్గం నుంచి వచ్చిన బహుమతిగా ఆయన దాన్ని అభివర్ణించడం విశేషం.

ఇదీ చూడండి: కరోనాను జయించి జనంలోకి వస్తోన్న ట్రంప్!

ఈ డ్రగ్​ వాడేందుకు అనుమతి ఉన్న అతికొద్ది మందిలో ట్రంప్​ ఒకరు. కరోనా చికిత్సలో దీనిని అందరికీ అందుబాటులో ఉంచాలంటే.. అమెరికాలోని ఆహార, ఔషధ నియంత్రణ సంస్థ(ఎఫ్​డీఏ) అంగీకారం తప్పనిసరి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.