ETV Bharat / international

ఉక్రెయిన్​లో దుర్భర పరిస్థితి.. చర్యలు అవసరం: భారత్​ - తిరుమూర్తి

UNSC meeting on Ukraine: ఉక్రెయిన్​లో పరిస్థితులు మరింత దిగజారుతున్నాయని, తక్షణం స్పందించాల్సిన అవసరం ఉందని ఐరాస భద్రతా మండలిలో ఆందోళన వ్యక్తం చేసింది భారత్​. ఆ దేశంలోని భారతీయులతో పాటు మిగతా పౌరులను సురక్షితంగా తరలించాలని డిమాండ్​ చేసింది. దాడులకు ముగింపు పలికి, చర్చలకు ఇరు దేశాలు తిరిగి రావాలని పునరుద్ఘాటించింది.

TS Tirumurti at UNSC meeting
తిరుమూర్తి
author img

By

Published : Mar 8, 2022, 8:34 AM IST

UNSC meeting on Ukraine: ఉక్రెయిన్​లోని భారతీయులతో పాటు అమాయకులైన ఇతర దేశాల పౌరులను సురక్షితంగా, నిరంతరాయంగా తరలించాలని డిమాండ్​ చేశారు ఐక్యరాజ్య సమితిలోని భారత శాశ్వత ప్రతినిధి టీఎస్​ తిరుమూర్తి. ఐరాస భద్రతా మండలి సమావేశంలో ఉక్రెయిన్​లోని​ పరిస్థితులపై మాట్లాడారు. రష్యా, ఉక్రెయిన్​లకు విన్నవించుకున్నప్పటికీ సుమీలో చిక్కుకున్న తమ విద్యార్థులను తరలించేందుకు సురక్షిత కారిడార్​ ఏర్పాటు కాలేదని ఆందోళన వ్యక్తం చేశారు.

"ఉక్రెయిన్​ నుంచి 20,000 మంది భారత పౌరులు సురక్షితంగా స్వదేశం చేరేందుకు సదుపాయాలు కల్పించగలిగాం. ఇతర దేశాల పౌరులు వారి స్వదేశానికి చేరుకునేందుకు సాయపడ్డాం. తటస్థ, స్వతంత్రత, నిష్పాక్షికత అనే నియమాలపై ఆధారపడి మానవతా చర్యలు ఉంటాయి. ఉక్రెయిన్​లో పరిస్థితులు దిగజారుతున్నాయి. తీవ్ర మానవ సంక్షోభానికి దారితీస్తోంది. తక్షణం ఈ అంశంపై దృష్టి సారించి చర్యలు తీసుకోవాలి. ఐరాస అంచనా ప్రకారం 1.5 మిలియన్ల మంది ఉక్రెయిన్​ ప్రజలు సరిహద్దు దేశాలకు వలస వెళ్లారు. ఓ భారతీయ విద్యార్థితో పాటు 140 మంది మృతి చెందారు. యువకుడి మృతికి యావత్​ భారత్​ కన్నీరు పెట్టుకుంది. అతని కుటుంబానికి ప్రగాఢ సానుభూతి. "

- టీఎస్​ తిరుమూర్తి, ఐరాసలో భారత శాశ్వత ప్రతినిధి.

దాడులకు తక్షణమే ముగింపు పలకాలని భారత్​ నిరంతరంగా కోరుతోందన్నారు తిరుమూర్తి. ఇరు దేశాల అధినేతలతో భారత ప్రధాని మోదీ మాట్లాడి.. తక్షణ కాల్పుల విరమణ కోసం పిలుపునిచ్చారని తెలిపారు. ఇరు పక్షాలు చర్చల మార్గానికి తిరిగి రావాలని సూచించినట్లు చెప్పారు. ఉక్రెయిన్​లో చిక్కుకున్న భారతీయుల కోసం 80 విమానాలకుపైగా నడిపినట్లు వెల్లడించారు. అందుకోసం సహకరించిన ఉక్రెయిన్​, సరిహద్దు దేశాల అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. భారత్​ ఇప్పటికే ఉక్రెయిన్​, దాని సరిహద్దు దేశాలకు ఔషధాలు, టెంట్లు, నీటి నిలువ ట్యాంకులు వంటి సామగ్రిని మానవతా సాయం కింద అందించినట్లు చెప్పారు.

ఇదీ చూడండి: సామ్రాజ్యవాదమే లక్ష్యంగా.. ఉక్రెయిన్​పై పుతిన్‌ నరమేధం!

ఉక్రెయిన్‌ దాడిలో రష్యా మేజర్‌ జనరల్‌ మృతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.