శ్వేతసౌధం స్పందన
మ్యూలర్ నివేదికపై శ్వేతసౌధ మీడియా కార్యదర్శి సారా శాండర్స్ స్పందించారు.
"ఈ అంశంపై తదుపరి కార్యాచరణ పూర్తిగా అటార్నీ జనరల్దే. వారు ఏ నిర్ణయం తీసుకున్నా స్వాగతిస్తాం. ప్రత్యేక దార్యప్తు అధికారి నివేదికపై మాకు ఇంకా ఎలాంటి సమాచారం లేదు."
- సారా శాండర్స్, శ్వేతసౌధ అధికార ప్రతినిధి
ప్రజల ముందుకు తీసుకురావాలి...
అధ్యక్ష ఎన్నికలపై జరిపిన దర్యాప్తు నివేదికను ఎలాంటి పక్షపాతం లేకుండా ప్రజల ముందుంచాలని డెమొక్రటిక్ పార్టీ డిమాండ్ చేసింది. మ్యూలర్ సమర్పించిన సాక్ష్యాధారాలను ఎట్టి పరిస్థితుల్లోనూ అధ్యక్షుడి విభాగానికి, న్యాయవాదులకు ఇవ్వకూడదని కోరింది.