ETV Bharat / international

అధ్యక్ష పోరు: '270 మార్క్' దక్కేదెవరికి?

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో 270 ఎలక్టార్ల ఓటర్లు సాధించిన అభ్యర్థి శ్వేతసౌధానికి చేరుతారు. ఇప్పటికే అనేక సర్వేలు.. ప్రజలు బైడెన్​కే మద్దతిస్తున్నట్టు స్పష్టం చేస్తున్నాయి. అయితే 270 ఓట్లు సాధించేందుకు ఇరువురు అభ్యర్థలుకు ఎన్ని అవకాశాలున్నాయి?

Road to 270: Biden has options, Trump walks narrow path
'అధ్యక్ష' పోరు: శ్వేతసౌధానికి దారేది?
author img

By

Published : Nov 1, 2020, 7:26 PM IST

డొనాల్డ్​ ట్రంప్​, జో బైడెన్..​. ఒకరు అమెరికాకు ప్రస్తుత అధ్యక్షుడు, మరొకరు మాజీ ఉపాధ్యక్షుడు. నవంబర్​ 3న జరగనున్న అధ్యక్ష ఎన్నికల్లో ఎవరిని విజయం వరిస్తుందన్నదే ఇప్పుడు అందరి ప్రశ్న. అయితే అధ్యక్ష పోరులో బైడెన్​ ముందంజలో ఉన్నట్టు ఇప్పటికే అనేక సర్వేలు చెబుతున్నాయి. వాటిని లెక్కచేయకుండా రిపబ్లికన్లు ముందుకు సాగుతున్నారు.

ఇంతకీ విజయతీరాలకు చేరడం కోసం ట్రంప్​, బైడెన్​ ముందున్న మార్గాలేంటి? ఏ రాష్ట్రం ఎవరికి కీలకం కానుంది? '270' ఎలక్టార్ల మ్యాజిక్​ ఫిగర్​ను పొందడానికి ఇరువురికి ఎన్ని అవకాశాలున్నాయి?

బైడెన్​ అవకాశాలు ఇలా..

2016కు ముందు.. మిషిగాన్​, పెన్సిల్వేనియా, విస్కాన్సిన్​ డెమొక్రాట్ల కంచుకోటలు. అయితే హిల్లరీ క్లింటన్​పై ఈ రాష్ట్రాల్లో అనూహ్య విజయం సాధించి అధ్యక్ష పదవిని చేపట్టారు ట్రంప్​.

వీటిని తిరిగి చేజిక్కించుకుని, హిల్లరీ గెలిచిన రాష్ట్రాల్లోనూ బైడెన్​ గెలిస్తే.. మాజీ ఉపాధ్యక్షుడి ఖాతాలో 279 ఎలక్టోరల్​ ఓట్లు పడినట్టే. బైడెన్​కు ఇది అత్యంత సులభమైన మార్గం. 2016లో ట్రంప్​ గెలిచిన రాష్ట్రాల్లో విజయం సాధించకుండానే అధ్యక్ష పదవిని బైడెన్​ చేపట్టే అవకాశం ఈ మార్గంలో ఉండటం విశేషం.

ఇదీ చూడండి:- 2020 అమెరికా అధ్యక్ష పోరులో ప్రత్యేకతలెన్నో...

ఇందుకోసం పదునైన ప్రణాళికలు రచించారు బైడెన్​. భారీగానే ఖర్చు చేశారు కూడా. ప్రకటనలకు కేటాయించిన మొత్తం వ్యయంలో దాదాపు 150మిలియన్​ డాలర్లు(30శాతం) ఈ రాష్ట్రాలకే ఖర్చుపెట్టినట్టు సమాచారం.

అయితే పెన్సిల్వేనియాలో బైడెన్​ గట్టిపోటీ ఎదుర్కొంటున్నారు. సర్వేల ప్రకారం ఈ రాష్ట్రంలోనూ ముందంజలో ఉన్నప్పటకీ.. ట్రంప్​కు బైడెన్​కు మధ్య ఉన్న వ్యత్యాసం చాలా తక్కువ.

పెన్సిల్వేనియా చిక్కకపోతే?

పెన్సిల్వేనియాలో బైడెన్​ ఓడిపోతే.. మరో రాష్ట్రం నుంచి 11 ఎలక్టోరల్​ ఓట్లను ఆయన సంపాదించుకోవాల్సి ఉంటుంది. దక్షిణ, నైరుతి రాష్ట్రాలైన ఆరిజోనా(11), నార్త్​ కారోలినా(15).. బైడెన్​ ముందున్న అవకాశాలు.

ఆరిజోనాలో 1996 తర్వాత రిపబ్లికన్లదే పైచేయి. కానీ 2016లో ట్రంప్​ ఇక్కడ 3.5శాతం ఆధిక్యంతో గెలుపొందారు. గత 20ఏళ్లలోనే ఇది అత్యల్పం. అయితే ఈసారి ఈ రాష్ట్రంలో విజయంపై డెమొక్రాట్లు ధీమాగా ఉన్నారు. తమ బలమైన అభ్యర్థి, మాజీ వ్యోమగామి మార్క్​ కెల్లీని ఇక్కడ మోహరించింది డెమొక్రటిక్​ పార్టీ.

ఇదీ చూడండి:- అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రక్రియ ఇంత సంక్లిష్టమా?

ఆరిజోనాతో పాటు నెవాడాను తమ ఖాతాలో వేసుకుంటామని డెమొక్రాట్లు తేల్చిచెబుతున్నారు. రిపబ్లికన్లు 2004లో చివరగా ఇక్కడ గెలవడం ఇందుకు కారణం.

నార్త్​ కారోలినాలో మాత్రం పోటీ తీవ్రంగా ఉండేడట్టే కనపడుతోంది. 2008లో మాజీ అధ్యక్షుడు, నాటి డెమొక్రటిక్​ పార్టీ అభ్యర్థి బరాక్​ ఒబామా ఇక్కడ గెలుపొందారు. కానీ 2012లో అత్యల్ప మెజారిటీతో ఓడిపోయారు. క్లింటన్​ది కూడా ఇదే పరిస్థితి. అయితే ఈసారి బైడెన్​కు అవకాశాలు మెరుగ్గా ఉన్నట్టు కనపడుతోంది.

ఇంకో మార్గమూ ఉంది...

మిషిగాన్​, పెన్సిల్వేనియా, విస్కాన్సిన్​లో గెలుపొంది.. ఆరిజోనా- నార్త్​ కరోలినాలోని ఏదో ఒక రాష్ట్రంలో బైడెన్​ విజయం సాధిస్తే.. దాదాపు 290 ఎలక్టార్ల ఓట్లను బైడెన్​ తన ఖాతాలో వేసుకోవచ్చు.

వీటితో పాటు 2016లో ట్రంప్​ గెలిచిన ఒహాయో(8శాతం), ఐయోవా(10శాతం), జార్జియా(5శాతం) రాష్ట్రాల్లోను పోటీపడుతున్నారు బైడెన్​. వీటిల్లో గెలిస్తే బైడెన్​కు సులభంగా 300 ఓట్లు పడినట్టే.

ఇదీ చూడండి:- అమెరికా అధ్యక్ష ఎన్నికల ఖర్చు రూ.లక్ష కోట్లు!

జార్జియాలో బైడెన్​ స్వయంగా ప్రచారాలు నిర్వహించారు. ఐయోవా, ఒహాయోలో మాత్రం ప్రకటనల కోసం 5మిలియన్​ డాలర్లు, 7మిలియన్​ డాలర్లు ఖర్చు పెట్టారు.

ఈ ఎన్నికల్లో టెక్సాస్​ రూపంలో బైడెన్​కు మరో అవకాశం దక్కింది. ఎన్నో దశాబ్దాలుగా టెక్సాస్​.. రిపబ్లికన్ల కంచుకోట. తొలిసారిగా ఇక్కడ జెండా ఎగరవేసే అవకాశాలు డెమొక్రాట్లకు కనిపించాయి.

ట్రంప్​ అవకాశాలు ఇలా...

జో బైడెన్​తో పోల్చుకుంటే ట్రంప్​నకు అవకాశాలు చాలా తక్కువగానే ఉన్నాయి. ఇందులో ముఖ్యమైనది, అత్యంత కీలకమైనది ఫ్లోరిడా. ఇక్కడ విజయం సాధించకుండా 270 ఎలక్టార్​ ఓట్లను ట్రంప్​ తన ఖాతాలో వేసుకోలేరు. ఈ నేపథ్యంలో ఇక్కడ డెమొక్రాట్ల నుంచి రిపబ్లికన్లకు గట్టి పోటీ ఎదురవుతోంది. బైడెన్​ ముందంజలో ఉన్నట్టు కొన్ని సర్వేలు చెబుతున్నాయి.

ఇదీ చూడండి:- ఈ రాష్ట్రాలు ఎటువైపు 'స్వింగ్' అవుతాయి?

నెల రోజుల వ్యవధిలో మూడుసార్లు ఫ్లోరిడాలో పర్యటించారు ట్రంప్​. దీని బట్టి ఆ రాష్ట్రం ట్రంప్​నకు ఎంత కీలకమో అర్థమవుతుంది.

హిల్స్​బర్గ్​లో కౌంటీ ఇటీవలే ప్రచారం నిర్వహించారు ట్రంప్​. 2016లో ఇక్కడ హిల్లరీ క్లింటన్​ 41వేల ఓట్లతో గెలుపొందారు.

అయితే హిల్స్​బర్గ్​కు సమీపంలో పినెల్లస్​ కౌంటీ ఉంది. రాష్ట్రంలో ఇది అత్యంత ముఖ్యమైన కౌంటీ. ఇక్కడ 2012 నుంచి రిపబ్లికన్లదే విజయం. ఈసారీ విజయం తమదేనని రిపబ్లికన్లు ధీమాగా ఉన్నారు.

పెన్సిల్వేనియాలో విజయంపై చాలా ఆశలు పెట్టుకున్నారు ట్రంప్​. అందుకు తగ్గట్టుగానే రాష్ట్రంలోని ప్రతి మూలకు వెళ్లి ప్రచారాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ఇక్కడ 7సార్లు పర్యటించారు.

ఇదీ చూడండి:- ట్రంప్​ 18 ర్యాలీలు.. 30వేల కరోనా కేసులు

మిగిలిన దారులు ఇంకా క్లిష్టంగా..

పెన్సిల్వేనియాతో పాటు దక్షిణ, నైరుతి ప్రాంతాల్లోని కీలక రాష్ట్రాల్లో గెలిచినప్పటికీ.. 270 ఓట్లు పొందడం ట్రంప్​కు కష్టమే.

మరోవైపు ఫ్లోరిడా, పెన్సిల్వేనియాలో గెలిచి.. 2016లో దక్కించుకున్న రాష్ట్రాల్లో కొన్నింటిని కోల్పోయినా.. మ్యాజిక్​ ఫిగర్​ను ట్రంప్​ చేరుకోవడం కష్టమే. ఒహాయో, ఐయోవాతో పాటు 2016లో తృటిలో ఓడిపోయిన కొన్ని ప్రాంతాల్లోనూ గెలుపొందడం అవసరం.

మిన్నెసోటా, నెవాడా, న్యూ హాంప్​షైర్​లో గతంలో ఓటమి పాలయ్యారు ట్రంప్​. అయితే ఓసారి అధ్యక్ష పదవిని చేపట్టిన వ్యక్తి.. గతంలో ఓడిపోయిన రాష్ట్రాల్లో గెలుపొంది, విజయం సాధించిన రాష్ట్రాల్లో ఓడిపోవడం రాజకీయంగా సాధ్యమయ్యే విషమేనా అని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ఇదీ చూడండి:- బైడెన్​కు భారీగా పడనున్న ఆసియా- అమెరికన్ల ఓట్లు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.