2021లో తొలి సూర్యగ్రహణం ఏర్పడింది. వలయాకారంలో సూర్యుడు కనువిందు చేశాడు. మధ్యాహ్నం సమయంలో ఈ దృశ్యాలు కనిపించాయి. ఉత్తర అమెరికా, కెనడా, ఐరోపా, రష్యాలో సంపూర్ణంగా సూర్యగ్రహణం కనిపించింది.
మధ్యాహ్నం 1.42కు ప్రారంభమైన సూర్య గ్రహణం.. సాయంత్రం 6.41 వరకు కొనసాగనున్నట్లు తెలుస్తోంది. భారత్‌లోని లద్ధాక్, అరుణాచల్ ప్రదేశ్లలో సూర్యాస్తమయానికి ముందు గ్రహణం పాక్షికంగా కనిపించే అవకాశం ఉంది.
!['Ring of fire' annual solar eclipse](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/12084386_vlcsnap-2021-06-10-16h21m24s843-4.jpg)
!['Ring of fire' annual solar eclipse](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/12084386_vlcsnap-2021-06-10-16h21m24s843-1.jpg)
!['Ring of fire' annual solar eclipse](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/12084386_vlcsnap-2021-06-10-16h21m24s843-3.jpg)
వలయాకార సూర్యగ్రహణం అంటే..?
వలయాకార సూర్యగ్రహణంలో సూర్యుడి కేంద్ర భాగం కనిపించకుండా జాబిల్లి అడ్డుగా ఉంటుంది. దీంతో చంద్రుడి వెనుక సూర్యుడి వెలుపలి భాగం వలయాకారంలో మెరుస్తూ కనువిందు చేస్తుంది. ఆ వలయాన్ని 'జ్వాలా వలయం'గా పిలుస్తారు. కాగా.. ఈ ఏడాది రెండో సూర్యగ్రహణం డిసెంబర్ 4న ఏర్పడుతుందని నిపుణులు చెబుతున్నారు.
ఇదీ చదవండి: Viral: హెల్మెట్‌ను మింగిన ఏనుగు