అమెరికా అధ్యక్ష ఎన్నికలకు తమ అభ్యర్థిగా డొనాల్డ్ ట్రంప్‌ను రిపబ్లికన్ పార్టీ తిరిగి నామినేట్ చేసింది. ఈ మేరకు అధికారికంగా ప్రకటించింది. దీనిపై ఆగస్టు 27న ట్రంప్ అంగీకార ప్రసంగం చేయనున్నట్లు తెలుస్తోంది.
నాలుగేళ్లకు ఒకసారి నిర్వహించే పార్టీ కన్వెన్షన్‌లో సభ్యులు ఈ మేరకు నిర్ణయానికి వచ్చారు. వర్చువల్‌గా నిర్వహించిన సమావేశానికి 50 రాష్ట్రాలకు చెందిన పార్టీ ప్రతినిధులు హాజరయ్యారు. వీరంతా అధ్యక్షుడిని తిరిగి నామినేట్ చేసేందుకే మొగ్గుచూపారు. ఉపాధ్యక్ష అభ్యర్థిగా మైక్ పెన్స్‌ను మరోసారి ప్రతిపాదించారు. బుధవారం అధికారికంగా తన అంగీకార ప్రసంగం చేయనున్నారు పెన్స్.
డెమొక్రటిక్ పార్టీ తరపున అధ్యక్ష అభ్యర్థిగా జో బైడెన్ ఇప్పటికే నామినేట్ అయ్యారు. ఉపాధ్యక్ష అభ్యర్థిగా కమలా హారిస్‌ను ఎంచుకున్నారు బైడెన్. నవంబర్ 3న జరగబోయే ఎన్నికల్లో బైడెన్‌తో ట్రంప్ తలపడనున్నారు.
ఇదీ చదవండి- అమెరికా ఎన్నికలకు ముందు ఆస్టరాయిడ్ ముప్పు