ETV Bharat / international

ఒక్క కరెంట్ తీగ వల్ల వేల ఎకరాల అడవి దగ్ధం! - అమెరికాలో కార్చిచ్చులు

కాలిఫోర్నియా అడవుల్లో గతేడాది ఏర్పడిన కార్చిచ్చుపై అధికారులు నివేదిక రూపొందించారు. ఓ చెట్టు కొమ్మ కరెంటు స్తంభానికి తాకడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని నివేదికలో పేర్కొన్నారు.

california
కాలిఫోర్నియాలో కార్చిచ్చుకు కారణం అదే..
author img

By

Published : Mar 23, 2021, 11:48 AM IST

అమెరికాలోని ఉత్తర కాలిఫోర్నియాలో గతేడాది సంభించిన కార్చిచ్చుకు కారణం.. చెట్టు కొమ్మ కరెంటు స్తంభానికి తాకడమేనని అధికారులు సోమవారం వెల్లడించారు. ఇందుకు సంబంధించి ఆ రాష్ట్ర అగ్నిమాపక శాఖ నివేదిక రూపొందించింది.

"సుదీర్ఘ దర్యాప్తు తర్వాత మాకు ఘటనకు గల కారణం స్పష్టమైంది. ఇగో కమ్యూనిటీలో పసిఫిక్​ గ్యాస్​ అండ్ ఎలక్ట్రిక్​ సంస్థ ఏర్పాటు చేసిన విద్యుత్​ లైనును పైన్​ చెట్టు కొమ్మలు తాకాయి. ఈ క్రమంలో అగ్ని ప్రమాదం జరిగి అది కాస్తా కార్చిచ్చుగా మారింది. నివేదికను షాస్తా కౌంటీ డిస్ట్రిక్ట్​ అటార్నీ కార్యాలయానికి పంపించాము."

-కాలిఫోర్నియా అగ్నిమాపక శాఖ

గతేడాది సెప్టెంబరు, అక్టోబరు నెలల మధ్య సంభవించిన ఈ కార్చిచ్చు కారణంగా 228 చదరపు కిలోమీటర్లకుపైగా అటవీ ప్రాంతం దెబ్బతింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందారు.

ఇదీ చదవండి : 'రానాను అప్పగించాలన్న భారత్​ అభ్యర్థనను ధ్రువీకరించండి'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.