ETV Bharat / international

అమెరికాలో కాల్పుల కలకలం.. ప్రముఖ ర్యాపర్​ మృతి

అమెరికాకు చెందిన ప్రముఖ ర్యాపర్ యంగ్ డాల్ఫ్(36)​ను కాల్చిచంపాడు ఓ దుండగుడు. ఈ ఘటన టెన్నెస్సీలోని మెంఫిస్ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో​ జరిగింది. ఈ ఘటనపై మెంఫిస్ మేయర్ దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. యంగ్ డాల్ఫ్​ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.

Rapper Young Dolph
ర్యాపర్ యంగ్ డాల్ఫ్
author img

By

Published : Nov 18, 2021, 5:07 AM IST

అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం రేపాయి. ప్రముఖ ర్యాపర్ యంగ్ డాల్ఫ్(36)పై గుర్తుతెలియని వ్యక్తులు కాల్పులకు పాల్పడ్డారు. ఈ ఘటనలో ఆయన ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన టెన్నెస్సీలోని మెంఫిస్ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో​ జరిగింది. ఈ ఘటనపై మెంఫిస్ మేయర్ దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. యంగ్ డాల్ఫ్​ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.

యంగ్ డాల్ఫ్​.. కేన్సర్​తో బాధపడుతున్న తన బంధువురాలిని చూసేందుకు మెంఫిస్​కు వచ్చిన సమయంలో ఓ గుర్తుతెలియని వ్యక్తి.. డాల్ఫ్​పై కాల్పులకు తెగబడినట్లు అతని సోదరి మరేనో మయర్స్ తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేశామని.. దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.

యంగ్ డాల్ఫ్​పై గతంలోనూ కాల్పులు జరిగాయి. 2017, సెప్టెంబరులో లాస్​ ఏంజెల్స్​లో అతడిపై కాల్పులు చేశారు. అదే ఏడాది ఫిబ్రవరిలోనూ యంగ్ డాల్ఫ్​పై కాల్పులకు పాల్పడ్డారు.

2008 నుంచి ర్యాపర్​గా కెరీర్​ను ప్రారంభించాడు యంగ్ డాల్ఫ్. పేపర్​ రూట్​ కాంపేన్​, కింగ్​ ఆఫ్ మెంఫిస్​, రిచ్ స్లేవ్​, తదితర ఆల్బమ్స్ ప్రజాదరణ పొందాయి.

ఇదీ చూడండి: 'గిన్నిస్​ డే' స్పెషల్.. వీరి సరికొత్త రికార్డులు సూపర్ గురూ!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.