ETV Bharat / international

కొత్త ఔషధంతో కరోనాకు సత్వర ఉపశమనం - కరోనాకు మరో మందు

ప్రపంచం మొత్తాన్ని గడగడలాడించిన కరోనాకు మరో ఔషధాన్ని కనుగొన్నారు టొరంటో శాస్త్రవేత్తలు. ఈ ఇంజెక్షన్​ తీసుకుంటే ఏడు రోజుల్లోనే ఇన్​ఫెక్షన్​ నుంచి కోలుకోవచ్చని తెలిపారు. వైరల్​ లోడు ఎక్కువగా ఉన్నవారికి ఈ ఔషధం వల్ల ప్రయోజనం కలుగుతుందని వివరించారు.

Quick relief to the corona with the new medicine
కొత్త ఔషధంతో కరోనాకు సత్వర ఉపశమనం
author img

By

Published : Feb 9, 2021, 7:07 AM IST

ఆసుపత్రిలో చేరాల్సిన అవసరం లేని కొవిడ్​ బాధితులు వేగంగా కోలుకోవడానికి దోహదపడే ఒక ప్రయోగాత్మక యాంటీవైరల్ ఔషధాన్ని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. పెగింటర్ ఫెరాన్-లాంబ్డా అనే ఈ ఇంజెక్షన్​ను ఒక్కసారి పొందినా.. ఏడు రోజుల్లోనే ఇన్​ఫెక్షన్ నుంచి బయటపడొచ్చని వారు పేర్కొన్నారు. "ఉద్ధృతంగా వ్యాపించే కొత్త రకాలు ప్రపంచవ్యాప్తంగా ఉత్పన్నమవుతున్నాయి. అవి టీకాలను, యాంటీబాడీ చికిత్సలకు పెద్దగా లొంగవు. ఈ నేపథ్యంలో తాజా ఔషధంతో ఉపశమనాన్ని పొందొచ్చు" అని పరిశోధనలో పాలుపంచుకున్న టొరంటో సెంటర్ ఫర్ లివర్ డిసీజ్ శాస్త్రవేత్త జోర్డాన్ ఫెల్డ్ చెప్పారు.

వైరల్​ లోడు ఎక్కువగా ఉన్నవారికి ఇంజక్షన్ వల్ల ప్రయోజనం కలుగుతుందని వివరించారు జోర్డాన్​. వైరస్​ను త్వరగా శరీరం నుంచి వదిలించడం వల్ల తీవ్రస్థాయి ఇన్​ఫెక్షన్ నుంచి తప్పించుకోవచ్చని చెప్పారు. అలాగే ఇతరులకూ వ్యాపించకుండా చూడొచ్చని తెలిపారు. బాధితులు స్వీయ ఏకాంతంలో ఉండాల్సిన సమయం కూడా తగ్గిపోతుందన్నారు. వైరస్​ ఇన్​ఫెక్షన్లు స్పందనగా శరీరం ఇంటర్​ ఫెరాన్-లాంబ్డా అనే ప్రోటీన్​ను ఉత్పత్తి చేస్తుంది. వైరస్​ను చంపేయడానికి అవసరమయ్యే అనేకరకాల కణ చర్యాక్రమాలను ఇది క్రియాశీలం చేస్తుందని శాస్త్రవేత్తలు వివరించారు.

ఇదీ చూడండి: మరో వ్యాక్సిన్​కు చైనా ప్రభుత్వం ఆమోదం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.