ETV Bharat / international

2022 వరకు 25% మందికి టీకా గగనమే! - కొవిడ్​-19 టీకాపై తాజా అధ్యయనం

కొవిడ్​-19 టీకా అందుబాటులోకి వచ్చినప్పటికీ.. 2022 వరకు ప్రపంచ జనాభాలో 25 శాతం మంది వ్యాక్సిన్​ పొందలేరని ఓ అధ్యయనం వెల్లడించింది. ప్రస్తుతం ముందస్తు ఒప్పందాలు చేసుకున్న డోసుల్లో 51 శాతం అధిక ఆదాయ దేశాలకే వెళ్లనున్నాయని తెలిపింది. స్వల్ప, మధ్యాదాయ దేశాలకు టీకా సరఫరాపై ఆందోళన వ్యక్తం చేసింది.

COVID-19 vaccine
కొవిడ్​-19 టీకా
author img

By

Published : Dec 16, 2020, 6:14 PM IST

కరోనా మహమ్మారి కట్టడికి పలు టీకాలు అందుబాటులోకి వస్తున్నాయి. ఇప్పటికే కొన్ని దేశాలు అత్యవసర వినియోగంలో భాగంగా వ్యాక్సిన్​ పంపిణీని ప్రారంభించాయి. అయితే.. ప్రపంచవ్యాప్తంగా నాలుగోవంతు ప్రజలు 2022 వరకు టీకా పొందలేరని ఓ నివేదిక తేల్చింది. అందుబాటులోకి వచ్చిన వ్యాక్సిన్ల పంపిణీ సవాళ్లతో కూడుకున్న అంశంగా పేర్కొంది. ఈ పరిశోధన వివరాలు బీఎంజే జర్నల్​లో ప్రచురితమయ్యాయి.

అమెరికాలోని జాన్స్​ హాప్కిన్స్​ బ్లూమ్​బెర్గ్​ స్కూల్​ ఆఫ్​ పబ్లిక్​ హెల్త్​కు చెందిన శాస్త్రవేత్తలు ఈ పరిశోధనలో పాల్గొన్నారు. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల ముందస్తు బుకింగ్స్​ను పరిశీలించి పలు విషయాలు వెల్లడించారు.

" అధిక ఆదాయ దేశాలు భవిష్యత్తులో కొవిడ్​-19 వ్యాక్సిన్​ సరఫరా కోసం ఏ విధంగా వ్యవహరిస్తున్నాయనేదానిపై మా అధ్యయనం ఒక అవగాహన కల్పిస్తోంది. కానీ, మిగతా ప్రపంచం వ్యాక్సిన్​ పొందటంపై అనిశ్చితి నెలకొంది. పారదర్శకతతో కొవిడ్​-19 వ్యాక్సిన్​ సమానంగా కేటాయించటంపై ప్రభుత్వాలు, తయారీ సంస్థలు భరోసా కల్పించాల్సిన అవసరం ఉంది."

- పరిశోధకుడు

అధ్యయనంలోని కీలక అంశాలు..

  • ప్రపంచవ్యాప్తంగా 48 కొవిడ్​-19 వ్యాక్సిన్లు ప్రస్తుతం క్లినికల్​ ట్రయల్స్​లో ఉన్నాయి. అందులో 13 సంస్థల నుంచి పలు దేశాలు నవంబర్​ 15 నాటికి 748 కోట్ల డోసులను రిజర్వ్​ చేసుకున్నాయి.
  • ఇప్పటికే ముందస్తు ఒప్పందాలు చేసుకున్న డోసుల్లో 51 శాతం అధిక ఆదాయ దేశాలకే వెళ్లనున్నాయి. అది 14 శాతం ప్రపంచ జనాభాను సూచిస్తోంది. మిగతా 85 శాతానికిపైగా జనాభా స్వల్ప, మధ్యాదాయ దేశాల్లోనే ఉండటం ఆందోళన కలిగిస్తోంది.
  • ప్రస్తుతం ఉన్న వ్యాక్సిన్​ క్యాండిడేట్లు విజయవంతమైతే.. 2021 చివరి నాటికి మొత్తం 596 కోట్ల కోర్సులు​ (1192 కోట్ల డోసులు) తయారు చేసే సామర్థ్యం ఉంది. వాటి ధర ఒక్కో కోర్సుకు 6-74 డాలర్ల మేర ఉండనుంది.
  • 40 శాతం వ్యాక్సిన్​ కోర్సులు స్వల్ప, మధ్య ఆదాయ దేశాలకు కేటాయించే వీలుంటుంది. అయితే.. అది అమెరికా, రష్యా వంటి అధిక ఆదాయ దేశాలు ఏ విధంగా అంతర్జాతీయ కార్యక్రమాల్లో పాలుపంచుకుంటాయనే అంశంపై ఆధారపడి ఉంటుంది.
  • టీకా తయారీదారులందరూ తమ గరిష్ఠ ఉత్పత్తి సామర్థ్యాన్ని చేరుకోవడంలో విజయవంతం అయినప్పటికీ, ప్రపంచ జనాభాలో కనీసం నాలుగోవంతు మందికి 2022 వరకు వ్యాక్సిన్​ అందే పరిస్థితి లేదు.

370 కోట్ల మంది సిద్ధం..

బీఎంజే జర్నల్​లోనే ప్రచురితమైన మరో అధ్యయనం ప్రపంచవ్యాప్తంగా 370 కోట్ల మంది టీకా తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు అంచనా వేసింది. అది ప్రపంచ జనాభాలో 68 శాతం ఉంటుందని తేల్చింది. ఈ అధ్యయనంలో చైనా, అమెరికాకు చెందిన పరిశోధకులు పాల్గొన్నారు. న్యాయమైన, సమానమైన కేటాయింపు వ్యూహాల అభివృద్ధికి తమ అధ్యయనం మార్గనిర్దేశం చేస్తుందని తెలిపారు శాస్త్రవేత్తలు.

ఇదీ చూడండి:ఆసుపత్రి నుంచి వచ్చాక ఆ 10 రోజులు ముప్పే!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.