ETV Bharat / international

శ్వేతసౌధం వద్ద పోలీసులు, నిరసనకారుల మధ్య ఘర్షణ - protest against trump

అమెరికాలో ఓట్ల లెక్కింపు జరుగుతున్న వేళ శ్వేతసౌధం సమీపంలో అధ్యక్షుడు ట్రంప్​కు వ్యతిరేకంగా నిరసనకారులు ఆందోళన చేపట్టారు. ఈ క్రమంలో పోలీసులు, ఆందోళనకారుల మధ్య ఘర్షణ చెలరేగింది.

Washington
శ్వేతసౌధం సమీపంలో ఆందోళన
author img

By

Published : Nov 4, 2020, 10:30 AM IST

అమెరికా అధ్యక్ష ఎన్నికల ఓట్ల లెక్కింపు జరుగుతున్న వేళ వాషింగ్టన్​లో పోలీసులు, నిరసనకారుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. నగరంలోని బీఎల్​ఎం ప్లాజా వద్ద ఫలితాల కోసం కొందరు ఆందోళన చేపట్టగా ఈ ఘటన జరిగింది.

వందల మంది నిరసనకారులు నినాదాలు, నృత్యాలు చేస్తూ ఓట్ల లెక్కింపు కోసం డిమాండ్ చేశారు. "ట్రంప్​ను తొలగించాలి", "ట్రంప్ ఎప్పుడూ అబద్దాలే చెబుతారు" అంటూ బ్యానర్లు ప్రదర్శించారు. పోలీసులు వీరిని అడ్డుకున్నారు.

శ్వేతసౌధం సమీపంలో ఆందోళన

ఈ ఘటన శ్వేతసౌధానికి సమీపంలో జరిగింది. ఆ సమయంలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అక్కడే తన సన్నిహితులతో కలిసి ఎన్నికల ఫలితాలను వీక్షిస్తున్నారు.

ఇప్పటికే శ్వేతసౌధం చుట్టూ అదనపు భద్రత కోసం ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు.

ఇదీ చూడండి: ట్రంప్xబైడెన్: రికార్డు ఓటింగ్- హోరాహోరీ ఫలితాలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.