ETV Bharat / international

అమెరికాలో మరో 'ఫ్లాయిడ్'- పరిస్థితి విషమం

author img

By

Published : Aug 24, 2020, 4:56 PM IST

జార్జి ఫ్లాయిడ్ ఉదంతంతో అట్టుడికిన అమెరికాలో అదే తరహా ఘటన మరొకటి చోటుచేసుకుంది. విస్కాన్సిన్​లో ఓ పోలీసు జరిపిన కాల్పుల్లో నల్లజాతీయుడు తీవ్రంగా గాయపడ్డాడు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటనపై తీవ్ర స్థాయిలో నిరసనలు వ్యక్తమవుతున్నాయి.

Protesters march after Wisconsin police shoot man in back
పోలీసు కాల్పుల్లో నల్లజాతీయుడికి తీవ్రగాయాలు

అమెరికా విస్కాన్సిన్​లోని కెనోషాలో ఓ పోలీసు జరిపిన కాల్పుల్లో ఓ నల్లజాతి వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ప్రస్తుతం మిల్వాకీలో చికిత్స పొందుతున్న బాధితుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

ఆదివారం సాయంత్రం ఐదుగంటల సమయంలో ఈ కాల్పులు జరిగినట్లు పోలీసులు తెలిపారు. స్థానికంగా తలెత్తిన ఓ ఘటనను అడ్డుకునే ప్రయత్నంలో తుపాకీ ఉపయోగించినట్లు చెప్పారు. అయితే కాల్పులకు దారితీసిన పరిస్థితులపై స్పష్టతనివ్వలేదు.

కాల్పులకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. ఓ వ్యక్తి కారులోకి ప్రవేశించే సమయంలో పోలీసు అధికారి అడ్డుకున్నారు. అనంతరం కారులోకి కాల్పులు జరిపారు. ఏడు రౌండ్ల కాల్పులు జరిపినట్లు వీడియో ద్వారా తెలుస్తోంది.

ప్రజాగ్రహం

ఈ ఘటనతో మరోసారి ప్రజల్లో ఆగ్రహజ్వాలలు మిన్నంటాయి. పోలీసు కాల్పులకు వ్యతిరేకంగా వీధుల్లో నిరసనలు చేపట్టారు. పోర్ట్​లాండ్​లోని ఓ పోలీస్ స్టేషన్ ఆవరణకు నిరసనకారులు నిప్పంటించారు. నగరంలో భారీ ర్యాలీలు చేపట్టారు. ఆదివారం రాత్రంతా నిరసనలు జరిగాయి. కర్ఫ్యూ విధించినప్పటికీ భారీగా ప్రజలు వీధుల్లో మోహరించారు.

ఈ నేపథ్యంలో ఆందోళనలను కట్టడి చేసేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. నిరసనకారులను చెదరగొట్టేందుకు బాష్పవాయు గోళాలను ప్రయోగించినట్లు తెలుస్తోంది.

'ఇతనే మొదటివాడు కాదు'

కాల్పుల ఘటనను విస్కాన్సిన్ గవర్నర్ టోనీ ఎవర్స్ ఖండించారు. పోలీసుల చేతిలో గాయపడిన, మరణించిన నల్లజాతీయుల్లో ఈ వ్యక్తి మొట్టమొదటివాడు కాదని వ్యాఖ్యానించారు.

"ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియదు. అయితే మన దేశంలో చట్టం అమలు చేసే వ్యక్తుల చేతిలో కనికరం లేకుండా మరణించిన, గాయపడిన నల్లజాతీయుల్లో ఇతను మొదటివాడు కాదు. మనం ఈ విషయంపై సానుభూతి ప్రకటించడమే కాకుండా అదే స్థాయిలో చర్యలు తీసుకోవాలి. రాష్ట్రంలో జాతి విద్వేషాన్ని గుర్తించలేకపోయిన నేతలను నిలదీయాల్సిన అవసరం ఉంది."

-టోనీ ఎవర్స్​, విస్కాన్సిన్ గవర్నర్

మిన్నియాపొలిస్ పోలీసుల కస్టడీలో జార్జి ఫ్లాయిడ్ మృతి తర్వాత హింసాత్మక నిరసనలతో పోర్ట్​లాండ్ అట్టుడికిపోయింది. ఈ నేపథ్యంలో మరోసారి ఇలాంటి పరిణామాలు తలెత్తడంపై ప్రజలు తీవ్రంగా మండిపడుతున్నారు.

ఇదీ చదవండి: 'భాజపాతో కుమ్మక్కు'పై కాంగ్రెస్​లో రగడ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.