ETV Bharat / international

ట్రంప్​ అభ్యర్థనతో జార్జియాలో మళ్లీ రీకౌంటింగ్​

author img

By

Published : Nov 25, 2020, 5:19 AM IST

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో కీలక రాష్ట్రమైన జార్జియాలో మళ్లీ రీకౌంటింగ్​ ప్రారంభమైంది. రాష్ట్ర నిబంధనల ప్రకారం చేపట్టిన ఆడిట్​(చేతితో ఓట్ల లెక్కింపు)లో జో బైడెన్​ విజయం సాధించిన కొద్ది రోజుల్లోనే అధికారిక రీకౌంటింగ్​ చేపట్టారు అధికారులు. అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ అభ్యర్థన మేరకు రీకౌంటింగ్​ చేస్తున్నట్లు చెప్పారు.

Georgia
ట్రంప్​ అభ్యర్థనతో జార్జియాలో మళ్లీ రీకౌంటింగ్​

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఓటమిని అంగీకరించటం లేదు అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​. ఎన్నికల్లో కీలక రాష్ట్రమైన జార్జియాలో ఆడిట్​ (చేతితో లెక్కింపు) ముగిసిన కొద్ది రోజుల్లోనే మళ్లీ రీకౌంటింగ్​ చేపట్టారు అధికారులు. చేతితో లెక్కింపులో జో బైడెన్​ విజయం సాధించారు. ట్రంప్​పై 12,670 ఓట్లు, 0.25 శాతం మెజారిటీ సాధించారు. ఫలితాలను ధ్రువీకరించిన క్రమంలో రీకౌంటింగ్​ చేపట్టాలని కోరారు అధ్యక్షుడు ట్రంప్​.

రాష్ట్ర ఎన్నికల చట్టం ప్రకారం ఫలితాల్లో 0.5 శాతం లోపే మార్జిన్​తో ఓటమి చెందిన వ్యక్తి రీకౌంటింగ్​ కోరేందుకు అవకాశం ఉంటుంది. ఈ క్రమంలో రీకౌంటింగ్​ చేపట్టాలని గత శనివారం ఎన్నికల అధికారులను కోరింది ట్రంప్​ బృందం.

ట్రంప్​ బృందం అభ్యర్థన మేరకు మంగళవారం ఉదయం 9 గంటలకు సుమారు 5 మిలియన్ల ఓట్లను యంత్రాలు(హైస్పీడ్​ స్కానర్లు) ద్వారా​ రీకౌంటింగ్​ ప్రారంభించారు. డిసెంబర్​ 2, రాత్రి 11.59 గంటల వరకు సమయం ఇచ్చారు. కొన్ని ప్రాంతాల్లో మంగళవారం ఓటింగ్​ యంత్రాలను పరీక్షించాలని నిర్ణయించటం వల్ల ఆయా ప్రాంతాల్లో బుధవారం కౌంటింగ్​ ప్రారంభం కానుంది.

నెవాడాలో బైడెన్​ విజయం..

నెవాడాలో అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​పై డెమొక్రటిక్​ అభ్యర్థి జో బైడెన్​ గెలుపొందినట్లు ప్రకటించింది ఆ రాష్ట్ర సుప్రీం కోర్టు. ఆరు ఎలక్టోరల్​ ఓట్లు బైడెన్​కు వచ్చినట్లు ఏడుగురు సభ్యుల ధర్మాసనం ఏకగ్రీవంగా తీర్పు వెలువరించింది. ఈ మేరకు డెమొక్రటిక్​ గవర్నర్​ స్టీవ్​ సిసోలక్​ను ఆదేశించింది.

ఇదీ చూడండి: అధికార బదిలీకి ట్రంప్ అంగీకారం.. కానీ!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.