ETV Bharat / international

అమెరికాలో ఓటా? లేటా? క్యా కరోనా..? - అమెరికా అధ్యక్ష ఎన్నికలు వాయిదా పడనున్నాయా?

ఓ వైపు కరోనా సంక్షోభం, మరోవైపు జాతివివక్షపై నిరసనలు.. అమెరికాను అట్టుడుకిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అధ్యక్ష ఎన్నికలు సకాలంలో జరుగుతాయా? లేదా వాయిదా పడతాయా? అనేది హాట్​ టాపిక్​గా మారింది.

presidential elections in America  will  be postponed?
అమెరికాలో ఓటా? లేటా?
author img

By

Published : Jun 12, 2020, 8:05 AM IST

బడులు ఎప్పుడు తెరుస్తారు? కాలేజీ చదువులెలా సాగుతాయి? కొలువులెలా ఉంటాయి? మునుముందు ప్రయాణాలెలా? పనులెలా?

ప్రపంచమంతా వీటిపై తలపట్టుకుంటుంటే... వీటితో పాటు అమెరికాను మరో ముఖ్యమైన ప్రశ్న వేధిస్తోంది! అదే...

అధ్యక్ష ఎన్నికలెలా? సజావుగా సాగేనా? చరిత్రలో ఎన్నడూ లేనట్లు వాయిదా పడేనా?

ఒకవైపు కరోనా విజృంభణ... మరోవైపు జాత్యహంకార ధోరణిపై కొనసాగుతున్న నిరసనల నేపథ్యం అధ్యక్ష ఎన్నికలపై మేఘంగా ముసురుకుంది. ఈ సాకుతో ట్రంప్‌ ఎన్నికలను వాయిదా వేయిస్తారని ఆయన ప్రత్యర్థులు అనుమానిస్తున్నారు. కానీ అదంత తేలిక కాదని ఆ దేశ చరిత్ర చెబుతోంది. కరోనా ప్రభావంతో పాత పద్ధతిలో ఎన్నికలు నిర్వహించలేకున్నా, ప్రత్యామ్నాయాలున్నాయని నిపుణులు చెబుతున్నారు.

trump
అధ్యక్ష ఎన్నికలు వాయిదా వేద్దామా? వద్దా?

ప్రస్తుత సంక్షోభ స్థితిలో ఓటింగ్‌కున్న మార్గాలేంటి? వాటిని ట్రంప్‌ ఎందుకు వద్దంటున్నారు?

నవంబరులో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరుగుతాయా?

జరిగితే ఎలా జరుగుతాయి.. అనేదిప్పుడు అమెరికా రాజకీయాల్లో చర్చనీయాంశం! యావత్‌ ప్రపంచంపై ప్రభావం చూపించే అమెరికా అధ్యక్ష ఎన్నికలు గడువు ప్రకారమైతే ఈ ఏడాది నవంబరు 3న జరగాలి. కరోనా తోడు... అమెరికాలో సాగుతున్న జాత్యహంకార నిరసన ఉద్యమం నేపథ్యంలో డొనాల్డ్‌ ట్రంప్‌, ఆయన శిబిరం చేస్తున్న వ్యాఖ్యలు అధ్యక్ష ఎన్నికలపై అనుమానాలను, ఆసక్తిని పెంచుతున్నాయి!

రాజ్యాంగంలో ఏముంది?

అమెరికాలో ఏ ఎన్నికలైనా వాయిదా వేసుకోవచ్చు. కానీ అధ్యక్ష ఎన్నికలకు ఆ అవకాశం లేదు. కారణం- అధ్యక్ష ఎన్నిక తేదీని అమెరికా రాజ్యాంగం స్పష్టంగా నిర్దేశించింది. అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు పదవీస్వీకారం చేసిన నాలుగేళ్ళ తర్వాత వచ్చే నవంబరులో తొలి సోమవారం తర్వాతి మంగళవారంనాడు కొత్త అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడిని ఎన్నుకొనే ఎలక్టోరల్‌ కాలేజీకి ఎన్నికలు జరగాలి- అని అమెరికా రాజ్యాంగం నిర్దేశించింది.

  • ఈ తేదీని మార్చాలంటే రాజ్యాంగాన్ని సవరించాలి. ఒకవేళ ట్రంప్‌ అందుకు సిద్ధమైనా... ప్రస్తుతం డెమొక్రాట్లు ఆధిక్యంలో ఉన్న అమెరికా ప్రతినిధుల సభ అందుకు అంగీకరిస్తుందా అనేది ప్రశ్నార్థకం! ట్రంప్‌ వ్యతిరేక అల్లర్లను పక్కనబెడితే... కరోనా కారణంగా ప్రజలు బయటకు వచ్చి ఓటు వేయలేని దారుణమైన పరిస్థితులు తలెత్తితే మాత్రం డెమొక్రాట్లు సైతం వాయిదాకు మద్దతు ఇవ్వటం అనివార్యం అయ్యే అవకాశాలు లేకపోలేదు. అందుకే నాలుగు నెలల తర్వాత దేశంలో కరోనా ప్రభావం ఎలా ఉంటుందన్నదానిపైనే అధ్యక్ష ఎన్నికలు సకాలంలో జరుగుతాయా లేదా అనేది అధారపడుతుంది. ఒకవేళ అలాంటి రాజ్యాంగ సవరణ అంటూ జరిగితే అది సంచలనమే అవుతుంది!
  • అలా జరిగినా కొత్త అధ్యక్షుడు వచ్చేదాకా డొనాల్డ్‌ ట్రంప్‌ అధికారంలో ఏమీ కొనసాగలేరు.
  • అమెరికా రాజ్యాంగం ప్రకారం- అధికారంలో ఉన్న అమెరికా అధ్యక్షుడి పదవీకాలం నాలుగేళ్ళే! జనవరి 20తో ముగుస్తుంది. కొత్తవాళ్ళ ఎంపికతో దానికి సంబంధం లేదు. ఒకవేళ ట్రంప్‌ ఈసారి ఎన్నికల్ని వాయిదా (జనవరి దాటి) వేసినా రాజ్యాంగం ప్రకారం 2021 జనవరి 20 నాడు పదవిలోంచి తను దిగిపోవాల్సిందే! అప్పటికీ ఎన్నికలు జరగకుంటే ప్రతినిధుల సభ (కాంగ్రెస్‌) కొత్త అధ్యక్షుడిని, సెనెట్‌ -ఉపాధ్యక్షుడిని ఎంపిక చేస్తాయి (తాత్కాలికంగా)! కాంగ్రెస్‌ పదవీకాలం ముగిసేలోపు ఎన్నికలు జరగకుంటే అప్పుడు అధ్యక్షుడిని ఎంపిక చేయాల్సిన బాధ్యత సెనెట్‌ (ఇది మన రాజ్యసభ లాంటిది కాబట్టి పదవీకాలం ముగియటం అంటూ ఉండదు)పై పడుతుంది. ఇవన్నీ ఎన్నడూ అమెరికా చరిత్రలో జరగలేదు.

అల్లుడి నోట ఆ మాట...

joe biden
డెమొక్రాట్ల అభ్యర్థి బైడెన్

ట్రంప్‌ ప్రత్యర్థిగా ఆవిర్భవిస్తున్న మాజీ ఉపాధ్యక్షుడు బైడెన్‌ గత నెలలోనే - "చూస్తుండండి... ఏదోలా చేసి, ఏవో మాటలు చెప్పి ఎన్నికల్ని వాయిదా వేయటానికి ట్రంప్‌ ప్రయత్నించినా ఆశ్చర్యపోనవసరం లేదు" అంటూ వ్యాఖ్యానించటం గమనార్హం! ఆ మాటల్ని వెంటనే ట్రంప్‌ కొట్టేసినా... తాజాగా- "ఏమో నాకు తెలియదుగాని... కరోనా కారణంగా ఎన్నికలు సమయానికి జరుగుతాయో లేదో" అంటూ శ్వేతసౌధం సలహాదారు... స్వయానా ట్రంప్‌ అల్లుడైన కుష్నర్‌ కొద్ది రోజుల కిందట వ్యాఖ్యానించటంతో మళ్ళీ రాజకీయవర్గాల్లో కలకలం మొదలైంది. వీటికి తోడుగా- కరోనా పరిణామాలు నాలుగునెలల తర్వాత ఎలా ఉన్నా... తాజాగా అమెరికాలో నెలకొన్న రాజకీయ, సామాజిక పరిస్థితుల నేపథ్యంలో ట్రంప్‌ శిబిరం ఏం చేస్తుందనేది అందరిలోనూ ఉత్కంఠ రేకెత్తిస్తోంది. అధ్యక్ష ఎన్నికలపై అమెరికా రాజ్యాంగం ఏం చెబుతోంది? ఎన్నికల వాయిదా సాధ్యమేనా? అలాంటి సందర్భాలు గతంలో ఉన్నాయా అంటూ చరిత్ర తవ్వటం మొదలెట్టారంతా!

అలా చేద్దాం...డెమొక్రాట్లు అస్సలు వద్దు- ట్రంప్‌

ూీహసజ
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్

ఒకవేళ కరోనా విజృంభించినా కూడా ఎన్నికలను నిర్వహించుకునే అవకాశాలు అమెరికాలో ఉన్నాయి. సాధారణ ఓటింగ్‌తో పాటు ఆబ్సెంటీ బ్యాలెట్‌, మెయిల్‌ ఇన్‌ ఓటింగ్‌, ముందస్తు ఓటింగ్‌లాంటి పద్ధతులు అందుకు కొంతమేరకు వెసులుబాటు కల్పిస్తున్నాయి. భారీగా క్యూలల్లో నిలబడకుండా పోస్టు ద్వారా ఓటును పంపొచ్చు. ఇవన్నీ అమెరికా ఎన్నికల ప్రక్రియలో ముందే ఉన్నాయి. కానీ అవసరార్థం కొంతమందికే వీటిని వాడుతుంటారు. ప్రతి ఒక్కరూ పోలింగ్‌ కేంద్రానికి వచ్చి ఓటు వేయకుండా... మెయిల్‌ ఇన్‌ ఓటింగ్‌ను అందరికీ వర్తింపజేయాలని డెమొక్రాట్లు సూచిస్తున్నారు. కానీ ఈ పద్ధతిని అందరికీ వర్తింపజేయటానికి రిపబ్లికన్లు, ముఖ్యంగా ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అంగీకరించటం లేదు. "వృద్ధులకు, ఇళ్ళలోంచి రాలేని వైకల్యంగలవారికి, మిలిటరీ సిబ్బందికి ఈ పద్ధతులు మంచివే. కానీ... మామూలు ప్రజలందరికీ మెయిల్‌ ఇన్‌ బ్యాలెట్‌ అంటే అవకతవకలకు తావిచ్చినట్లే! ఈ పద్ధతిలో బోలెడంత మోసం జరుగుతుంది. మెయిల్‌ బ్యాలెట్లను తారుమారు చేసే ప్రమాదముంది. అందరికీ పద్ధతి పెడితే... రిపబ్లికన్‌ పార్టీ ఎన్నడూ అమెరికాలో ఇక మీదట అధికారంలోకి రాలేదు. దీన్ని మేం వ్యతిరేకిస్తాం" అని ట్రంప్‌ స్పష్టం చేశారు. పైగా ఈ మెయిల్‌ ఇన్‌ ఓటింగ్‌, ఆబ్సెంటీ ఓటింగ్‌ నిబంధనలు ఒక్కో రాష్ట్రంలో ఒక్కోలా ఉన్నాయి. కనుక ఇదెంత మేరకు ఫలిస్తుందనేదీ చెప్పలేని పరిస్థితి. ఈ నేపథ్యంలో నాలుగునెలల తర్వాత అమెరికాలో కరోనా విజృంభణ ఎలా ఉంటుందనేదానిపైనే ఎన్నికల తీరుతెన్నులు ఆధారపడి ఉంటాయి.

ఆబ్సెంటీ బ్యాలెట్‌

ఆబ్సెంటీ బ్యాలెట్‌ మన పోస్టల్‌ బ్యాలెట్‌లాంటిదే. ఎన్నికల రోజు నిర్దేశించిన పోలింగ్‌ కేంద్రానికి వెళ్ళి ఓటు వేయలేని పరిస్థితుల్లో పోస్టు ద్వారా ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు.

మెయిల్‌ ఇన్‌ పోలింగ్‌

పోస్టు ద్వారా ముందే బ్యాలెట్‌ను పంపిస్తారు. దాన్ని తీసుకొని తమ ఓటు వేసి దగ్గర్లోని పోలింగ్‌ కేంద్రంలో సమర్పించాలి. లేదా పోస్టు ద్వారా పంపించొచ్చు.

ముందస్తు ఓటింగ్‌

ఓటింగ్‌ రోజే కాకుండా... ముందుగానే తమ ఓటును వేయటానికి కల్పించే అవకాశం ఇది. ఈ పద్ధతులన్నీ కూడా వివిధ రాష్ట్రాల్లో ఒక్కోతీరుగా అమలవుతుంటాయి. ఇలా ఓటు వేయాలంటే ముందుగా రిజిస్టర్‌ చేసుకున్న ఓటర్లు అందుగల సహేతుకమైన కారణాలను పేర్కొనాల్సి ఉంటుంది. వాటిని సంబంధిత అధికారి ఆమోదిస్తేనే అందుకు అవకాశం కలుగుతుంది.

చరిత్ర ఏం చెబుతోంది?

  • ఇప్పటిదాకా ఎన్నడూ అమెరికా అధ్యక్ష ఎన్నికలు వాయిదా పడలేదు.
  • ప్రపంచ యుద్ధ సమయాల్లోనే కాకుండా అమెరికా అస్థిత్వానికే సవాలు విసిరిన, అత్యంత క్లిష్టమైన 1864 అంతర్యుద్ధం సమయంలోనూ అధ్యక్ష ఎన్నికలు ఆగలేదు.

ఇదీ చూడండి: ఐసీసీపై ఆంక్షలకు ట్రంప్ ఆమోదం- కారణాలివే..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.