ETV Bharat / international

ట్రంప్​Xబైడెన్​​: చర్చంతా కరోనాపైనే.. - జాత్యహంకారం

అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారం కీలక దశకు చేరుకుంది. రిపబ్లికన్‌ అభ్యర్థి ట్రంప్‌- డెమొక్రటిక్‌ పార్టీ అభ్యర్థి జో బైడెన్‌ల మధ్య గురువారం తుది ప్రెసిడెన్షియల్‌ డిబేట్‌ జరిగింది. వాడీవేడిగా జరిగిన ఈ సంవాదంలో.. అధ్యక్ష అభ్యర్థులు వేర్వేరు అంశాలపై తమ వైఖరులు తెలియజేశారు. కరోనా మొదలు.. అవినీతి ఆరోపణల దాకా, వలస విధానాల నుంచి జాత్యహంకారం వరకూ ట్రంప్​-బైడెన్​ తమ వాదనలు వినిపించారు. ఒకరి ప్రసంగానికి మరొకరు అడ్డుపడకుండా చర్చలో మైక్‌ను కట్‌ చేసేలా మ్యూట్‌ బటన్‌ను ఏర్పాటు చేశారు. ఒక్కో అంశంపై స్పందించడానికి ఒక్కొక్కరికీ రెండు నిమిషాల సమయం కేటాయించారు. ఇంతకీ అభ్యర్థులు ఏం మాట్లాడారు ?

Presidential debate
అధ్యక్ష బరి: డిబేట్​లో ప్రధాన అంశాలపై అధ్యక్ష అభ్యర్థుల వైఖరేంటి ?
author img

By

Published : Oct 23, 2020, 11:54 AM IST

Updated : Oct 23, 2020, 12:48 PM IST

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో కీలకంగా భావించే అభ్యర్థుల చివరి సంవాదం.. రసవత్తరంగా సాగింది. తుది ముఖాముఖి చర్చలో అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​, డెమొక్రటిక్​ పార్టీ అభ్యర్థి జో బైడెన్​.. దేశంలోని ప్రధాన సమస్యలతో పాటు, వ్యక్తిగత విషయాలపై ఆరోపణలు గుప్పించుకున్నారు. కరోనా అంశంపై సంవాదం ఆసక్తికరంగా జరిగింది.

ఎన్నికలకు కేవలం రెండు వారాల కంటే తక్కువ సమయం ఉన్న తరుణంలో జరిగిన ఈ చర్చలో ప్రధానంగా ట్రంప్, బైడెన్​ వైఖరిపై అందరూ దృష్టి సారించారు. ట్రంప్‌ కరోనా నుంచి కోలుకున్న తర్వాత నిర్వహించిన చర్చ కావడంతో మహమ్మారి కట్టడిపై ఆయన వైఖరిలో ఎలాంటి మార్పు ఉండనుందనే దానిపై సర్వత్రా ఆసక్తి కనిపించింది. ఈ నేపథ్యంలో కరోనా అంశంపైనే కీలక చర్చ జరిగింది. ట్రంప్​ ఈ విషయంలో వివరణ ఇచ్చుకునే ప్రయత్నం చేయగా.. ప్రభుత్వం వైఫల్యంపై బైడెన్​ విమర్శలు గుప్పించారు.

ట్రంప్​-బైడెన్​ వాడీవేడి చర్చ
  • కరోనా విజృంభణ..

ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న కరోనా విజృంభణతోనే అభ్యర్థుల చర్చ ప్రారంభమైంది.

ట్రంప్‌: తమ ప్రభుత్వం తీసుకున్న చర్చల వల్ల అంచనాల కంటే తక్కువ మంది చనిపోయారు. త్వరలో మహమ్మారి అంతం కాబోతోంది. నేను కరోనా నుంచి కోలుకున్నట్లుగానే అందరూ బయటపడతారు. అందరికీ రోగనిరోధక శక్తి ఏర్పడుతుంది. మహమ్మారి వ్యాప్తికి నేనో లేక బైడెనో కారణం కాదు. చైనాయే అసలు కారణం. కొన్ని వారాల్లో వ్యాక్సిన్‌ అందుబాటులోకి వస్తుంది. మహమ్మారిని ఎదుర్కోవడంలో నా ప్రభుత్వం తీసుకున్న చర్యలను చాలామంది దేశాధినేతలు ప్రశంసించారు. మనకు వ్యాక్సిన్ త్వరలోనే వస్తుంది. సిద్ధమవుతోంది. కొద్దివారాల్లో దీనిమీద ప్రకటన వస్తుంది. పంపిణీకి కూడా అన్ని సిద్ధం చేశాం. సైన్యం ఈ వ్యాక్సిన్ పంపిణీని నిర్వహిస్తుంది. దీనిపై సమన్వయకర్త వివరణ కోరడంతో ట్రంప్‌ కాస్త వెనక్కి తగ్గారు. వ్యాక్సిన్‌పై తాను చేసిన వ్యాఖ్య హామీ కాదని.. కేవలం అంచనా మాత్రమే అని వివరించారు.

బైడెన్‌: వ్యాక్సిన్‌ పంపిణీకి ట్రంప్‌ వద్ద ఎలాంటి ప్రణాళిక లేదు. రాబోయే శీతాకాలంలో మరిన్ని చీకటి రోజులు ఎదుర్కోబోతున్నాం. లక్షల మంది మరణాలు కారణమైన వ్యక్తిని మాట్లాడే అర్హతే లేదు. చైనా నుంచి రాకపోకలపై ట్రంప్​ సరైన సమయంలో నిర్ణయం తీసుకోలేదు. కరోనా ప్రమాదకారి అని ఇంతవరకు ట్రంప్​ చెప్పకపోవడం శోచనీయం. ఇప్పటికీ వైరస్​ వల్ల ప్రమాదం లేదనే ట్రంప్​ చెప్పడం విడ్డూరంగా ఉంది.

  • హెల్త్‌కేర్‌..

ట్రంప్‌: గత అధ్యక్షుడు బరాక్​ ఒబామా.. అమెరికా-ఉత్తర కొరియా మధ్య తాత్కాలిక సంబంధాల విషయంలో గందరగోళం సృష్టించారు. ఆ పరిస్థితులను చక్కదిద్దిన ఘనత నాదే. నా హయాంలో ఒబామా కేర్‌ కంటే మెరుగైన ఆరోగ్య విధానాన్ని తీసుకొచ్చాను. ఇంకా మెరుగైన విధానాన్ని రూపొందిస్తాం. మేం కచ్చితంగా గెలుస్తాం. మా విధానాలు, ప్రాధాన్యాలు ఏంటో మీరే చూస్తారు.

బైడెన్‌: ఇప్పటికే అనేక వ్యాధులతో బాధపడుతున్న వారిని కూడా సంరక్షణ కల్పిస్తానన్న ట్రంప్‌ హామీకి సవాల్‌ విసురుతున్నా. చాలా రోజుల నుంచి ట్రంప్‌ ఆరోగ్య విధానం గురించి మాట్లాడుతున్నారు. కానీ, ఇప్పటి వరకు ఎలాంటి స్పష్టమైన విధానాన్ని రూపొందించలేదు.

  • అవినీతి ఆరోపణలు..

బైడెన్‌: నేను ఇప్పటి వరకు నా జీవితంలో విదేశాల నుంచి ఒక్క డాలర్‌ కూడా తీసుకోలేదు. రష్యా, చైనా సహా అనేక దేశాల్లో ట్రంప్‌కు వ్యాపారాలు ఉన్నాయి. రష్యా, చైనా నుంచి ట్రంప్‌కు భారీగా ఆర్థిక సాయం అందుతోంది. ట్రంప్ చైనాలో కూడా రహస్యంగా ఓ బ్యాంకు ఖాతాను నిర్వహిస్తున్నారు. నా కుమారుడి వస్తున్న ఆరోపణలను ఖండిస్తున్నాను. తప్పు చేసినట్లుగా ఆధారాలు ఉంటే చూపండి.

ట్రంప్‌: బైడెన్‌ ఇప్పటి వరకు రష్యా నుంచి 3.5 మిలియన్ల డాలర్లు తీసుకున్నారు. ఈ సందర్భంగా ట్రంప్‌ మరోసారి బైడెన్‌ తనయుడు హంటర్‌ బైడెన్‌ వ్యాపారాలను ప్రస్తావించారు. విదేశాలతో కుదుర్చుకున్న ఒప్పందాల్లో అనేక అవినీతికి పాల్పడినట్లు ఆరోపించారు.

  • వలస విధానం...

చట్టవిరుద్ధంగా అమెరికాలోకి ప్రవేశించిన తల్లిదండ్రుల నుంచి పిల్లల్ని వేరుచేసే విధానంపై ట్రంప్‌ దాటవేత ధోరణిని అవలంబించారు. అలాంటి వారి కోసం ఒబామా హయాంలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలపైకి చర్చను మళ్లించారు. వాటిని పంజరాలుగా అభివర్ణించారు.

బైడెన్‌: ''తల్లిదండ్రుల నుంచి పిల్లల్ని వేరు చేసి ట్రంప్‌ పెద్ద నేరానికి పాల్పడ్డారు. వారు ఇప్పుడు ఏకాకులుగా మారారు. ఎక్కడికి వెళ్లాలో దిక్కుతోయడం లేదని చెప్పుకొచ్చారు.''

  • జాత్యహంకారం..

ట్రంప్‌: న‌ల్ల‌జాతి అమెరిక‌న్ల‌కు ఉత్త‌మ దేశాధ్య‌క్షుడిని. బానిస‌త్వాన్ని రూపుమాపిన మాజీ అధ్య‌క్షుడు అబ్ర‌హం లింక‌న్ త‌ర్వాతే.. న‌ల్ల‌జాతీయుల్ని ఆదుకున్న‌ది నేనే. బైడెన్ ఎన్నో ద‌శాబ్ధాల నుంచి రాజ‌కీయంలో ఉన్నార‌ు. కానీ ఆయ‌న న‌ల్ల‌జాతి అమెరిక‌న్ల కోసం ఏమీ చేయ‌లేద‌ు. న‌ల్ల‌జాతీయుల‌కు చెందిన కాలేజీలు, యూనివ‌ర్సిటీల‌ను ర‌క్షించాను. ఇక్కడ ఉన్న వారిలో జాత్యహంకారం లేని వారిలో నేను ముందుంటాను.

బైడెన్‌: అమెరికా చరిత్రలో అత్యంత జాత్యహంకారం ఉన్న అధ్యక్షుడు ట్రంప్‌. అమెరికా ఆధునిక చ‌రిత్ర‌లో అత్యంత జాత్య‌హంకారం క‌లిగిన అబ్ర‌హం లింక‌న్ ఈయ‌నే. దేశంలో వివక్ష వ్యవస్థీకృతమైంది. దీన్ని రూపుమాపేందుకు కృషి చేయాల్సిన అవసరం ఉంది.

మరిన్ని..

అమెరికా ఎన్నికల్లో జోక్యం చేసుకునేందుకు ప్రయత్నించిన ఏ ఒక్క దేశాన్నీ వదిలిపెట్టేది లేదని జో బైడెన్‌ హెచ్చరించారు. కచ్చితంగా మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందన్నారు.

పారిస్​ పర్యావరణ ఒప్పందం నుంచి అమెరికా వైదొలగటాన్ని సమర్థించుకున్నారు డొనాల్డ్​ ట్రంప్​. భారత్​, చైనా, రష్యాలు.. వాయుకాలుష్యం తగ్గించేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవటం లేదని ఆరోపించారు.

అమెరికన్​ కార్మికుల కనీస వేతనాలను గంటకు 15డాలర్లుకు పెంచేందుకు కృషి చేస్తామని వెల్లడించారు బైడెన్​. వ్యాపారాలకు నష్టం వాటిల్లకుండా చూసుకుంటామని తెలిపారు.

చివరగా..

అమెరికా ఆర్థిక వ్యవస్థను తిరిగి పునరుద్ధరించాల్సిన అవసరం ఉంది. చైనా నుంచి వచ్చిన మహమ్మారి విజృంభణకు ముందు రోజుల్లోకి తిరిగి విజయవంతంగా తీసుకెళ్లాలి. దానికి నేను కట్టుబడి ఉన్నాను.

-ట్రంప్‌, రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థి

నాకు ఓటేశారా.. లేదా..అన్న దానితో నిమిత్తం లేకుండా నేను అమెరికా ప్రజలందరికీ ప్రాతినిధ్యం వహిస్తాను. దేశంలో మెరుగుపరచాల్సిన అంశాలు చాలా ఉన్నాయి. అవన్నీ మనకు అవకాశాలే.

-బైడెన్‌, డెమొక్రటిక్‌ పార్టీ అభ్యర్థి

ఇదీ చూడండి: ట్రంప్​ X బైడెన్​: కరోనా సన్నద్ధతపై వాడీవేడి చర్చ

ఇదీ చూడండి: ట్రంప్​Xబైడెన్​ : అధ్యక్షుడి వైఫల్యం వల్లే కేసులు పెరిగాయా?

ఇదీ చూడండి: వాయు కాలుష్యంపై భారత్​ నిర్లక్ష్యం: ట్రంప్​

Last Updated : Oct 23, 2020, 12:48 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.