ETV Bharat / international

నమస్తే ట్రంప్​: యుద్ధ మేఘాల నుంచి స్నేహగీతాల వరకు...

డొనాల్డ్​ ట్రంప్​, నరేంద్ర మోదీ... ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన నేతలు. భారత్​-అమెరికా మైత్రిని రాకెట్​ వేగంతో ముందుకు తీసుకెళ్తోన్న స్నేహితులు. ఇది ప్రస్తుతం. మరి గతంలో రెండు దేశాల బంధం ఎలా ఉండేది? భారత్​ను కట్టడి చేసే లక్ష్యంతో అమెరికా యుద్ధనౌకను పంపిందని తెలుసా? తర్వాత ఏం జరిగింది?

President Trump visit to India
అమెరికాతో భారత్​ దోస్తీ 'అంతకుమించి'
author img

By

Published : Feb 19, 2020, 1:15 PM IST

Updated : Mar 1, 2020, 8:11 PM IST

భారత్​- అమెరికా మైత్రి.. ఆసియాలో కొన్ని దేశాలకు వణుకు పుట్టిస్తోంది. దాయాది పాకిస్థాన్​, పొరుగు దేశం చైనాను ఆందోళనలో పడేస్తోంది. అయితే అంతకుముందు పరిస్థితి భిన్నం. ఈ స్థాయికి ఇరు దేశాల మైత్రి బంధం ఎదగడానికి ఎందరో కృషి చేశారు. ప్రస్తుతం ఇరు దేశాలు అజేయ శక్తులుగా ప్రపంచంలో తమ మైత్రిని విశ్వవ్యాప్తం చేస్తున్నాయి. డొనాల్డ్​ ట్రంప్​ భారత పర్యటనతో ఇది మరో స్థాయికి చేరనుంది.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ సతీసమేతంగా ఈ నెల 24, 25న భారత్​లో పర్యటించనున్నారు. ఇప్పటివరకు ఆయన ఎన్నడూ చూడని, ఇక మీద చూడలేనంతటి ఆతిథ్యాన్ని భారత్​ ఇవ్వనుంది.

ట్రంప్​ ఆసక్తి...

భారత పర్యటన కోసం తాను ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని ట్రంప్ ఇటీవల​ అన్నారు. విమానాశ్రయం నుంచి మోటేరా స్టేడియం వరకు లక్షల మంది తనకు స్వాగతం పలుకుతారని మోదీ తనకు చెప్పినట్లు ట్రంప్​ ప్రకటించారు. దాదాపు లక్షమంది ఉన్న సభలో మాట్లాడేందుకు ఉత్సాహంగా ఉన్నట్లు పేర్కొన్నారు.

ఒప్పందాలు మాత్రం...

భారత్​-అమెరికా మధ్య కీలక ఒప్పందాలు కుదరవచ్చని ట్రంప్​ పర్యటనకు కొద్ది రోజుల ముందే చర్చ మొదలైంది. అనూహ్యంగా ఆ అంచనాలకు తెర దించారు ట్రంప్. వాణిజ్య ఒప్పందం విషయంలో ఇప్పట్లో ముందడుగు పడదని తేల్చిచెప్పారు. అయితే... రక్షణ రంగానికి సంబంధించిన ఒప్పందంపై సంతకాలు చేసే అవకాశం ఉంది. ద్వైపాక్షిక, ప్రాంతీయ, అంతర్జాతీయ సమస్యలను పరిష్కరించుకునే దిశగా ఇరువురు నేతలు అడుగులు వేయనున్నారు. ఇరు దేశాల మధ్య 2+2 చర్చలు కలుపుకొని మొత్తం 60 వరకు అత్యున్నతస్థాయి సమావేశాలు జరిగాయి. రెండో దఫా 2+2 చర్చలు 2019 డిసెంబర్​లో వాషింగ్టన్​ వేదికగా సాగాయి.

అంతకుముందు...

2016 జూన్​లో భారత్​- అమెరికా 'అంతర్జాతీయ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని' కుదుర్చుకున్నాయి. భారత్​ను 'ప్రధాన రక్షణ భాగస్వామి'గా అమెరికా పేర్కొంది. తనకు అత్యంత సన్నిహిత, భాగస్వామ్య దేశాలతో సమానంగా భారత్​ను ముందుకు తెచ్చింది అగ్రరాజ్యం.

2005 ముందు 40 ఏళ్లలో అమెరికా నుంచి భారత్ ఎటువంటి రక్షణ పరికరాలను దిగుమతి చేసుకోలేదు. అయితే తరువాతి 15 సంవత్సరాలలో భారత రెండవ అతిపెద్ద రక్షణ భాగస్వామిగా అమెరికా అవతరించింది. 18 బిలియన్ డాలర్ల విలువైన అత్యాధునిక పరికరాలు సరఫరా చేస్తోంది. ఇంకా చాలా ఒప్పందాలు క్యూలో ఉన్నాయి.

ఈ మార్పు ఊహించారా..?

1971 డిసెంబరులో అప్పటి అమెరికా అధ్యక్షుడు నిక్సన్​.. భారత్​ను నిలువరించేందుకు యుద్ధనౌక 'యూఎస్​ఎస్​ ఎంటర్​ప్రైజ్' ​ నేతృత్వంలోని యూఎస్ 7వ నౌకాదళాన్ని బంగాళాఖాతానికి పంపారు.

పాకిస్థాన్​ నుంచి విముక్తి పొందేందుకు బంగ్లాదేశ్ స్వాతంత్ర్య సమరయోధులకు భారత్​ సాయమందించకుండా నియంత్రించేందుకు అమెరికా ఈ చర్యలు చేపట్టింది. ఇది నమ్మశక్యం కాకపోయినా నిజం.

అంతేకాదు ఆసియాలో భారత్​కు దీటుగా తన కొత్త మిత్రదేశం చైనాను అప్పట్లో అమెరికా ప్రోత్సహించింది.

ఆంక్షలకూ వెనుకాడలేదు...

1998 మే లో భారత్​ అణ్వాయుధ దేశంగా అవతరించినప్పుడు అమెరికా ఆంక్షలు విధించాలని ప్రయత్నించింది. అయినప్పటికీ, అప్పటి భారత విదేశీ వ్యవహారాల మంత్రి జస్వంత్ సింగ్, అమెరికా కార్యదర్శి స్ట్రోబ్​ టాల్​బోట్​ మధ్య విస్తృత వ్యూహాత్మక చర్చలు జరిగాయి. 1998-2000 మధ్య 3 ఖండాల్లోని 7 దేశాలలో 14 సార్లు కలిసిన వీరు ఇరు దేశాల మధ్య ఉన్న సంక్షోభాన్ని అవకాశంగా మార్చారు.

క్లింటన్​​తో నాంది...

2000 మార్చిలో అప్పటి అమెరికా అధ్యక్షుడు క్లింటన్ 5 రోజుల భారత పర్యటనకు విచ్చేశారు. ఆ పర్యటన భారత్​- అమెరికా సంబంధాలలో కొత్త శకానికి నాంది పలికింది. ఇక అప్పటి నుంచి ఇరుదేశాలు వెనక్కి తిరిగి చూడలేదు.

బుష్​ సాయం...

అణు వివాదం నుంచి భారత్​ను బయటకు తీసుకురావడానికి ఉన్న అన్ని అడ్డంకులను అధ్యక్షుడు బుష్ తొలగించారు. అప్పటి చైనా అధ్యక్షుడు హు జింటావోతో మాట్లాడి... ఈ వివాదంలో భారత్​కు ప్రధాన అడ్డుగా ఉన్న ఆ దేశాన్ని ఒప్పించారు.

2006 మార్చి 3న బుష్​​ దిల్లీలో భారత్​- అమెరికా సంబంధాలపై మాట్లాడారు.

"అమెరికా, భారత్​ గతంలో కంటే సన్నిహితంగా ఉన్నాయి. మన స్వేచ్ఛా దేశాల మధ్య భాగస్వామ్యానికి ప్రపంచాన్ని మార్చగల శక్తి ఉంది."

- బుష్​​, అప్పటి అమెరికా అధ్యక్షుడు

చివరకు 2008 సెప్టెంబర్ 6న ఎన్ఎస్​జీ (అణు సరఫరాదారుల బృందం) నుంచి భారత్​కు క్లీన్​చిట్​ లభించింది.

ఒబామాతో స్నేహం...

2010 నవంబర్​లో తన తొలి భారత పర్యటన సందర్భంగా పార్లమెంటులో ప్రసంగించారు అమెరికా అధ్యక్షుడు బరాక్​ ఒబామా. ఐరాస భద్రతా మండలిలో భారత్​ శాశ్వత సభ్యత్వానికి మద్దతు ఇస్తామని హామీ ఇచ్చారు.

"ఆసియా సహా ప్రపంచవ్యాప్తంగా భారత్​ కేవలం తన అస్థిత్వాన్ని చాటడం లేదు. భారత్​ శక్తిమంతమైన దేశంగా అవతరించింది."

- బరాక్​ ఒబామా, అమెరికా మాజీ అధ్యక్షుడు

అంతకుమించి...

ప్రస్తుతం అమెరికా- భారత్​ సంబంధాలు ఎవరూ ఊహించని స్థాయికి చేరాయి. రెండు అతిపెద్ద ప్రజస్వామ్య దేశాలు... బలమైన స్నేహితులుగా మారాయి. ఈ ఊహించని మార్పునకు కారణమేంటి? ఈ మార్పునకు రెండు దేశాలు కారణమే.

భారత్​ వైపు నుంచి ప్రజాస్వామ్య విలువలు, బహుళత్వం, దేశ ఆర్థిక వృద్ధి, మార్కెట్ విస్తరణ, ప్రవాస భారతీయుల ప్రభావం ఈ మార్పునకు కారణాలు. ఈ అన్ని రంగాల్లో భారత్​ అభివృద్ధిని అమెరికా స్వాగతించింది.

ఈ స్థాయిలో భారత్ మైత్రిని అమెరికా కోరుకోవడానికి పలు కారణాలున్నాయి. ఆసియాలో చైనా అమేయ శక్తిగా ఎదుగుతూ అమెరికాకే సవాలు విసురుతోంది. చైనాను అడ్డుకోవాలంటే ఆసియాలో అమెరికాకు కనిపిస్తోన్న దీటైన శక్తి భారత్​ మాత్రమే అనడంలో ఎలాంటి సందేహం లేదు.

(రచయిత- విష్ణు ప్రకాశ్​, విదేశాంగ శాఖ మాజీ అధికార ప్రతినిధి)

Last Updated : Mar 1, 2020, 8:11 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.