ETV Bharat / international

పార్టీలో ఫైరింగ్​- 9 మందికి గాయాలు

అమెరికాలోని సైరక్యూస్​ నగరంలో కాల్పుల మోత మోగింది. వందలాది మంది హాజరైన ఓ వేడుకలో దుండగులు కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో 17ఏళ్ల బాలుడు సహా మొత్తం 9మంది తీవ్రంగా గాయపడ్డారు.

author img

By

Published : Jun 21, 2020, 5:45 PM IST

Police: 9 shot, wounded at Syracuse, New York, 'celebration'
అమెరికాలోని ఓ వేడుకలో కాల్పుల మోత

అమెరికాలో మరోమారు కాల్పుల మోత మోగింది. న్యూయార్క్​లోని సైరక్యూస్​ నగరంలో శనివారం రాత్రి జరిగిన ఓ వేడుక ప్రాంగణం కాల్పుల శబ్దంతో దద్దరిల్లింది. ఈ ఘటనలో 9 మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఓ 17ఏళ్ల బాలుడు కూడా ఉన్నాడు. మిగిలిన వారి వయస్సు 18-53 మధ్య ఉంటుంది. అయితే వీరి ప్రాణాలకు ఎలాంటి ముప్పు ఉండకపోవచ్చని వైద్యులు ఆశాభావం వ్యక్తం చేశారు.

ఆ వేడుకలో..

కారు దొంగిలిచ్చారనే ఫిర్యాదు అందిన నేపథ్యంలో ఘటనాస్థలానికి చేరుకున్నారు పోలీసులు. అక్కడికి చేరుకున్న అనంతరం ఓ పార్కింగ్​ ప్రాంగణంలో వందల సంఖ్యలో ప్రజలను గుర్తించారు. వేడుకలో కాల్పులు శబ్దం వినిపించిందని పలువురు పోలీసులకు వెల్లడించారు.

ఈ వేడుక వివరాలపై ఎలాంటి స్పష్టత లేదు. అయితే వేడుకకు తాము అనుమతులివ్వలేదని సైరక్యూస్​ పోలీసు సారథి కెన్​టాన్ బక్నర్​​ స్పష్టం చేశారు. దర్యాప్తు ప్రస్తుతం ప్రాథమిక దశలో ఉందని వెల్లడించారు.

ఈ ఘటనకు సంబంధించి ఇంకా ఎవరినీ అదుపులోకి తీసుకోలేదు పోలీసులు.

ఇదీ చూడండి:- కరోనా కేసులు తగ్గించేందుకు ట్రంప్‌ చెప్పిన ఉపాయం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.