ETV Bharat / technology

హలో సైడ్​ ప్లీజ్- స్పేస్​ నుంచి రాయల్​ ఎన్​ఫీల్డ్​ ఈవీ వస్తోంది- టీజర్ చూశారా?

ఎలక్ట్రిక్ సెగ్మెంట్​లోకి రాయల్ ఎన్​ఫీల్డ్​- కిర్రాక్​ టీజర్ రిలీజ్​..!

author img

By ETV Bharat Tech Team

Published : 2 hours ago

Royal Enfield First Electric Bike
Royal Enfield First Electric Bike (Instagram/royalenfield))

Royal Enfield First Electric Bike: ప్రపంచ వ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాల (EV) వినియోగం వేగంగా విస్తరిస్తోంది. వాటిలో ముఖ్యంగా టూ-వీలర్స్​కు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. దీంతో కంపెనీలు కొత్త ఎలక్ట్రిక్ వాహనాలను రిలీజ్ చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే చెన్నైకు చెందిన ప్రముఖ మోటార్‌ సైకిల్‌ తయారీ సంస్థ రాయల్ ఎన్‌ఫీల్డ్ కూడా ఈవీ సెగ్మెంట్​లోకి అడుగుపెట్టేందుకు రెడీ అవుతోంది.

రాయల్ ఎన్​ఫీల్డ్ ఈవీ కిర్రాక్ టీజర్: దేశంలో 250-750సీసీ మోటార్‌సైకిల్ విభాగంలో నంబర్​ వన్​గా ఉన్న రాయల్ ఎన్​ఫీల్డ్​ తన మొదటి ఎలక్ట్రిక్ బైక్‌ను విడుదల చేయబోతోంది. ఈ నేపథ్యంలో కంపెనీ తన సోషల్ మీడియా హ్యాండిల్‌లో దీని మొదటి కిర్రాక్​ టీజర్​ను అధికారికంగా రిలీజ్ చేసింది. ఈ టీజర్​లో పారాచూట్​ సాయంతో ఓ మోటార్ సైకిల్ స్పేస్​ నుంచి కిందకు వస్తున్నట్లు చూపించారు. 'THE​ DROP' అంటూ.. 04-11-2024 తేదీని చూపించారు.

ఇంకా ఈ టీజర్​లో బైక్‌కు ముందు భాగంలో గిర్డర్ ఫోర్క్‌లు ఉన్నాయి. ఇది ఈ మోటార్‌సైకిల్ ఇంకా ప్రీ-ప్రొడక్షన్ దశలోనే ఉండొచ్చని సూచిస్తుంది. ఈ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్‌లోని ఫ్రంట్​ అండ్​ బ్యాక్ ఫెండర్‌లు, హెడ్‌ల్యాంప్‌లు, ఇండికేటర్స్ వంటి భాగాలు రాయల్ ఎన్‌ఫీల్డ్ సిగ్నేచర్ రెట్రో స్టైలింగ్‌తో ఉన్నాయి. పేటెంట్ మాదిరిగానే తాజా వీడియోలోని బైక్ కూడా సింగిల్-సీట్ సెటప్‌ను కలిగి ఉన్నట్లు కనిపిస్తోంది. ఇంజిన్‌కు బదులుగా ఎలక్ట్రిక్ మోటారుతో పాటు బ్యాటరీ ప్యాక్​ ఉండొచ్చు. దీంతోపాటు అల్యూమినియం స్వింగార్మ్, అల్లాయ్ వీల్స్, సాపేక్షంగా స్లిమ్ టైర్‌లతో కూడిన రౌండ్ మిర్రర్లు, సర్క్యులర్ ఇన్‌స్ట్రుమెంట్ ప్యానెల్ ఇందులో ఉన్నట్లు తెలుస్తోంది.

అయితే కంపెనీ మాత్రం ఈ ఈవీకి సంబంధించిన ఎలాంటి వివరాలనూ పంచుకోలేదు. కానీ ఓలా ఫస్ట్ ఎలక్ట్రిక్ మోటాలర్​ సైకిల్ కంటే ముందుగానే దీన్ని లాంచ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ ఎలక్ట్రిక్ బైక్​ డిజైన్ ఇప్పటికే లీకైంది. దీని ప్రకారం.. క్లాసికల్​గా డిజైన్ చేసిన బాబర్ ఫామ్ ఫ్యాక్టర్ ఇందులో కనిపిస్తుంది. దీని ఛాసిస్ డిజైన్ పూర్తిగా వెరైటీగా ఉంటుంది. ఈ బైక్​ రేక్-అవుట్ ఫ్రంట్ ఎండ్, స్కూప్-అవుట్ సోలో శాడిల్, ఓపెన్, వంగి ఉన్న వెనుక ఫెండర్లను కలిగి ఉంటుంది.

ఫ్యూయల్ ట్యాంక్ ప్లేస్​లోని లూపింగ్ ఫ్రేమ్ ప్రొడక్షన్ మోటార్ సైకిళ్ల కంటే చాలా డిఫరెంట్​గా ఉంటుంది. ఇది చూసేందుకు హార్లే డేవిడ్సన్ క్రూయిజర్ మోటార్ సైకిల్​ను పోలి ఉంటుంది. రాయల్ ఎన్​ఫీల్డ్​ తన ఎలక్ట్రిక్ సెగ్మెంట్ కోసం ప్రత్యేక వెబ్‌సైట్‌తో పాటు కొత్త ఇన్‌స్టా హ్యాండిల్‌(@royalenfieldev)ను కూడా ప్రారంభించింది.

టాటా మోటార్స్ మరో ఘనత- క్రాష్​ టెస్ట్​లో 5-స్టార్ సేఫ్టీ రేటింగ్స్

సైబర్‌ సెక్యూరిటీ నిపుణులకు ఫుల్​ గిరాకీ- ఈ స్కిల్స్​ నేర్చుకుంటే జాబ్ పక్కా..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.