అమెరికాలో శనివారం వేకువజామున జరిగిన కాల్పుల్లో ఒకరు మరణించారు. ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. వాటర్లూలోని ఐయోవాలో ఈ ఘటన జరిగింది. ఇక్కడి మోటార్ సైకిల్ క్లబ్లో కాల్పులు జరిగినట్లు అధికారులు తెలిపారు.
క్లబ్ వద్ద వందమందికిపైగా జనం పోగయ్యారు. తెల్లవారుజామున మూడు గంటల సమయంలో ఘర్షణ ప్రారంభమైంది. కాల్పులు జరిగినప్పుడు పోలీసులు ఘటనా స్థలికి సమీపంలోనే ఉన్నారని అధికారులు స్పష్టం చేశారు. ఎనిమిది మందికి బుల్లెట్ గాయాలు కాగా.. అందులో ఒకరు మరణించినట్లు వివరించారు.
ఇంత మంది హాజరు కావడానికి ఎలాంటి అనుమతులు లేవని, ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటివరకు ఎవరినీ అరెస్టు చేయలేదు.