ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(pm modi) పాలనకు దేశ ప్రజలు పట్టం కట్టారు. ప్రపంచంలోని 13 మంది దేశాధినేతల్లో అత్యధిక అప్రూవల్ రేటింగ్(modi approval rating) సంపాదించారు. 70 శాతం మంది ప్రజలు మోదీ పాలనను సమర్థించారు. అమెరికాకు చెందిన 'మార్నింగ్ కన్సల్ట్'(morning consult modi) అనే సంస్థ ఈ సర్వే చేపట్టింది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, జర్మనీ ఛాన్స్లర్ ఎంజెలా మెర్కెల్‌తో పోలిస్తే.. మోదీనే ముందంజలో ఉండటం గమనార్హం.
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అప్రూవల్ రేటింగ్(biden approval rating) కేవలం 40 శాతంగా నమోదైనట్లు మార్నింగ్ కన్సల్ట్(morning consult) వెల్లడించింది. అఫ్గాన్ నుంచి బలగాల ఉపసంహరణ, తాలిబన్ల ఆక్రమణ(taliban afghan takeover) వంటి పరిణామాల మధ్య బైడెన్ రేటింగ్ తగ్గినట్లు తెలుస్తోంది.
వ్యతిరేకతా తక్కువే
అదే సమయంలో మోదీ డిస్అప్రూవల్(పాలనపై అసమ్మతి వ్యక్తం చేసినవారు) రేటింగ్ ప్రపంచంలోనే అతితక్కువగా ఉండటం విశేషం. 25 శాతం మంది మాత్రమే ప్రధానికి ప్రతికూలంగా ఓటేశారు.
2019 ఆగస్టులో మోదీ రేటింగ్ 82 శాతంగా ఉంది. కరోనా రెండో వేవ్ సందర్భంగా ఈ ఏడాది జూన్‌లో ఇది 66 శాతానికి పడిపోయింది. వైరస్ తగ్గుముఖం పట్టడం, టీకాలు అందుబాటులోకి రావడం వల్ల.. గత రెండు నెలలుగా మోదీ రేటింగ్ మెరుగవుతూ వస్తోంది.
ఇదీ చదవండి: Rss Taliban: 'ఆరెస్సెస్ కార్యకర్తలు, తాలిబన్లు ఒకటే'