ETV Bharat / international

సముద్రంలో కూలిన విమానం- ప్రయాణికులంతా మృతి!

Plane Crash North Carolina: అమెరికా ఉత్తర కరోలినాలో ఘోర విమాన ప్రమాదం జరిగింది. 8 మందితో ప్రయాణిస్తున్న చిన్నపాటి విమానం అట్లాంటిక్ మహా సముద్రంలో కూలిపోయింది. ఈ ఘటనలో ఇప్పటివరకు ఒక మృతదేహం లభించగా.. మిగిలిన వారి ఆచూకీ కోసం ముమ్మర గాలింపు కొనసాగుతోంది.

plane crash north carolina
plane crash north carolina
author img

By

Published : Feb 15, 2022, 7:07 AM IST

Plane Crash North Carolina: ఎనిమిది మందితో ప్రయాణిస్తున్న చిన్నపాటి విమానం అట్లాంటిక్ మహా సముద్రంలో కూలిపోయింది. అమెరికా ఉత్తర కరోలినా రాష్ట్రం ఔటర్ బ్యాంక్స్ సమీపంలో ఈ దుర్ఘటన జరిగింది. ఇప్పటివరకు ఒక మృతదేహం లభించగా.. మిగిలిన వారి కోసం సహాయక సిబ్బంది విస్తృతంగా గాలిస్తున్నారు.

ప్రయాణికులంతా..!

పిలాటస్ పీసీ-12/47 సింగిల్ ఇంజిన్ విమానం.. సోమవారం మధ్యాహ్నం 1.35కు(స్థానిక కాలమానం ప్రకారం) హైడ్ కౌంటీ ఎయిర్​పోర్ట్ నుంచి టేకాఫ్​ అయినట్లు సమాచారం. అయితే.. 2 గంటలకల్లా ఆ విమానం రాడార్​ నుంచి మాయమైంది. విమానం సముద్రంలో కూలిపోయిందని నిర్ధరించుకున్న కోస్ట్ గార్డ్.. వెంటనే సహాయక చర్యలు చేపట్టింది. పడవలు, హెలికాప్టర్లను రంగంలోకి దించింది.

సముద్రంలో మూడు వేర్వేరు చోట్ల విమాన శకలాలు పడి ఉండడాన్ని కోస్ట్ గార్డ్ గుర్తించింది. అక్కడే ఒక మృతదేహాన్ని గుర్తించింది. విమానం ప్రధాన భాగం ఇంకా కనిపించలేదని, గాలింపు కొనసాగుతోందని అధికారులు తెలిపారు. ఎవరూ బతికి బయటపడే అవకాశాలు కనిపించడం లేదని చెప్పారు. ప్రయాణికులంతా కార్​టెరెట్ కౌంటీకి చెందినవారని, కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చామని వెల్లడించారు.

ఇవీ చూడండి: ఉక్రెయిన్‌పై ముప్పేట దాడి? మూడు వైపులా రష్యా బలగాల మోహరింపు!

రష్యా జీవనాడిపై అమెరికా గురి.. అదే జరిగితే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.