ETV Bharat / international

టీనేజర్లకు టీకా- ఎఫ్​డీఏకు ఫైజర్​ దరఖాస్తు - అమెరికాలో ఫైజర్​ టీకా వినియోగం

అమెరికాలో 12 నుంచి 15 ఏళ్ల వయసున్న టీనేజర్ల కోసం తమ టీకా అందించేందుకు అత్యవసర వినియోగానికి అనుమతి ఇవ్వాలని అక్కడి ఆహార ఔషధ సంస్థను ఫైజర్​ సంస్థ కోరింది. ఇటీవల ఈ వయస్సు వారిపై నిర్వహించిన పరీక్షల్లో తమ టీకా 100 శాతం సురక్షితమని తేలిందని పేర్కొంది.

Pfizer vaccine
టీనేజర్లకు టీకా- ఎఫ్​డీఏకు ఫైజర్​ దరఖాస్తు
author img

By

Published : Apr 10, 2021, 8:52 AM IST

అమెరికాలో 12 నుంచి 15 ఏళ్ల వయసు ఉన్న టీనేజర్లకు కూడా తమ టీకా అందించేందుకు అత్యవసర వినియోగానికి అనుమతి ఇవ్వాలని ఆ దేశ ఆహార ఔషధ నియంత్రణ సంస్థ(ఎఫ్​డీఏ)ను ఫైజర్ సంస్థ, దాని భాగస్వామి బయోఎన్​టెక్​ సంస్థలు కోరాయి. వీలైనంత త్వరగా 12 నుంచి 15 ఏళ్ల చిన్నారులకు టీకా​ అందించే దిశగా.. అత్యవసర అనమతి కోసం ఎఫ్​డీఏ సహా ఇతర దేశాల్లోని నియంత్రణ సంస్థలతోనూ తాము ప్రయత్నాలు జరుపుతున్నామని పేర్కొన్నాయి.

అమెరికాలో గతేడాది డిసెంబర్​ నుంచి 16 ఏళ్ల వయస్సు పైవారికి ఫైజర్​ టీకా అత్యవసర వినియోగానికి అమెరికా ఆమోదం తెలిపింది. మరోవైపు.. 12 నుంచి 15 ఏళ్ల మధ్య వయస్సు వారిపై జరిపిన ప్రయోగ పరీక్షల ఫలితాలను మార్చి 31న ప్రకటించగా.. తమ టీకా 100 శాతం సురక్షితమని తేలిందని ఫైజర్​​ సంస్థ తెలిపింది. టీకా పొందిన వారిలో పెద్దలకు వచ్చినట్లుగానే జ్వరం, చలి మొదలైనవి వస్తున్నాయని పేర్కొంది. టీకా ప్రభావంపై పూర్తి అధ్యయనం కోసం అభ్యర్థుల ఆరోగ్యాన్ని రెండేళ్ల పాటు గమనిస్తామని చెప్పింది.

ఇదీ చూడండి: 6 నెలల వరకు ఫైజర్‌ వ్యాక్సిన్‌ ప్రభావం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.