ETV Bharat / international

ప్రజా ఆందోళనలతో అధ్యక్షుడు రాజీనామా

పెరూ అధ్యక్షుడు మాన్యువల్​ మెరినో రాజీనామా చేశారు. ఇప్పటివరకు తాత్కాలిక ప్రెసిడెంట్​గా కొనసాగుతున్న మెరినోపై అక్కడి ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఈ క్రమంలో రాజీనామా ప్రాధాన్యం సంతరించుకుంది.

Peru political crisis worsens as Merino resigns
ప్రజా ఆందోళనలతో అధ్యక్షుడు రాజీనామ
author img

By

Published : Nov 16, 2020, 12:11 PM IST

పెరూ అధ్యక్షుడు మాన్యువల్​ మెరినోకు వ్యతిరేకంగా ప్రజలు చేపట్టిన నిరసనలతో ఆయన పదవికి రాజీనామా చేశారు. దీంతో ఆ దేశ రాజకీయాల్లో రాజ్యాంగ సంక్షోభం నెలకొంది. ఇప్పటికే మెరినోకు వ్యతిరేకంగా పెద్దమొత్తంలో ప్రజలు రోడ్ల మీదకు వచ్చి నిరసన తెలిపారు.

మాన్యువల్ మెరినో రాజీనామాకు ముందు ఆ దేశ ప్రజాప్రతినిధులు.. నిరసనల మధ్యనే లిమాలోని చట్టసభకు చేరుకున్నారు. ఆందోళనకారులను అదుపుచేయడానికి పోలీసులు టియర్​గ్యాస్​ను ప్రయోగించారు.

Peru political crisis worsens as Merino resigns
నిరసన వ్యక్తం చేస్తున్న ఆందోళనకారులు

ఇంతకుముందున్న అధ్యక్షుడు విజర్కాని అక్రమంగా తొలగించి అధికార పీఠం ఎక్కినట్లు మెరినో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఇంకా.. కరోనా కట్టడి, సామాజిక భద్రత కల్పనలో విఫలం అయినట్లు విమర్శలు వస్తున్నాయి.

ఇదీ చూడండి: పెరూ ఆందోళనలు హింసాత్మకం.. యువకుడు మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.