ETV Bharat / international

అంగారకుడిపై ఆక్సిజన్‌ తయారీ!

అంగారకుడిపై జీవజాలం జాడను కనుగొనేందుకు అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ(నాసా) ప్రవేశపెట్టిన మార్స్​ రోవర్​ పెర్సెవరెన్స్ మరో అద్భుతం సృష్టించింది. ఇప్పటికే విలువైన సమాచారాన్ని భూమికి పంపుతోన్న ఈ రోవర్​.. తాజాగా అరుణ గ్రహంపై ఆక్సిజన్​ను తయారు చేసింది.

author img

By

Published : Apr 23, 2021, 2:54 PM IST

perseverance
పెర్సెవరెన్స్‌

అరుణ గ్రహంపైకి నాసా పంపిన 'పెర్సెవరెన్స్‌' మరో అద్భుతం సృష్టించింది! చరిత్రలోనే తొలిసారిగా మరో గ్రహంపై ఈ ఆరు చక్రాల రోవర్‌ ఆక్సిజన్‌ను తయారు చేసింది. అక్కడ కొంత కార్బన్‌-డై-ఆక్సైడ్‌ను సేకరించిన పెర్సెవరెన్స్‌.. దాని నుంచి ప్రాణవాయువును ఉత్పత్తి చేసినట్టు నాసా వెల్లడించింది.

"రోవర్‌ ముందుభాగం కుడి వైపున కారు బ్యాటరీ పరిమాణంలో పసిడి పెట్టె ఉంది. దీన్ని మెకానికల్‌ ట్రీగా పిలుస్తారు. ఇది కార్బన్‌-డై-ఆక్సైడ్‌ను తీసుకుని, విద్యుత్తు, రసాయనాల సాయంతో దాన్ని విడగొట్టింది. తద్వారా 5 గ్రాముల ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేసింది. ఒక వ్యోమగామి పది నిమిషాల పాటు శ్వాసించడానికి ఇది సరిపోతుంది. ఈ మార్స్‌ ఆక్సిజన్‌ (మాక్సి).. పసిడి పెట్టెలోనే నిక్షిప్తమై ఉంది. గంటకు 10 గ్రాముల మేర ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేయాలన్న లక్ష్యంతో ఇంజినీర్లు ఈ మెకానికల్‌ ట్రీను రూపొందించారు. ఈ లక్ష్యం చేరుకునేందుకు కృషి జరుగుతోంది. భవిష్యత్తులో అక్కడికి వెళ్లే వ్యోమగాములకు ఆక్సిజన్‌ కొరత ఉండదు. తిరుగు ప్రయాణం కోసం భూమి నుంచి పనిగట్టుకుని అంగారకుడిపైకి రాకెట్‌ ప్రొపెల్లంట్‌ను తీసుకెళ్లాల్సిన అవసరమూ తప్పుతుంది" అని నాసా స్పేస్‌ టెక్నాలజీ మిషన్‌ అసోసియేట్‌ అడ్మినిస్ట్రేటర్‌ జిమ్‌ రాయిటర్‌ చెప్పారు.

ఫిబ్రవరి 18న అరుణగ్రహంపై దిగిన పెర్సెవరెన్స్‌లోని మినీ హెలికాఫ్టర్‌... గత సోమవారం అక్కడి ఉపరితలంలో కాసేపు చక్కర్లు కొట్టి చరిత్ర సృష్టించింది. రోవర్‌ కూడా మార్స్‌పై శబ్దాలను తొలిసారిగా నమోదు చేసింది.

ఇదీ చదవండి: మార్స్​పై అడుగుపెట్టిన నాసా పెర్సీవరెన్స్​ రోవర్​

ఇదీ చదవండి: మార్స్‌పై రోవర్‌ 'టెస్ట్‌ డ్రైవ్‌'.. అద్భుతం!

మళ్లీ ఎగిరింది.. మరింత ఎత్తుకు!

అంగారకుడిపై ఉన్న 1.8 కిలోల బుల్లి హెలికాఫ్టర్‌ 'ఇంజెన్యుటీ' గురువారం మరోసారి అక్కడి ఉపరితలంపై ప్రయోగాత్మకంగా ఎగిరింది. అయితే ఈసారి అది మరింత ఎత్తులో, ఎక్కువ సమయం చక్కర్లు కొట్టింది. సోమవారం నాడు తొలిసారిగా 3 మీటర్ల ఎత్తు ఎగిరిన ఈ హెలికాఫ్టర్‌.. గురువారం 5 మీటర్ల ఎత్తుకు వెళ్లింది. గతసారి కంటే 13 సెకెన్లు ఎక్కువగా మొత్తం 52 సెకెన్ల పాటు ప్రయాణించింది. ఈసారి 2 మీటర్ల దూరం పక్కకు జరిగింది.

"హెలికాప్టర్‌ను ఎలా ప్రయోగించాలన్నది పరిశీలిస్తున్నాం. చూడ్డానికి చాలా సులభమే అనిపించవచ్చుగానీ, దీని వెనుక ఎన్నో నిగూఢ అంశాలున్నాయి. భూ వాతావరణంతో పోల్చితే అక్కడి వాతావరణం 1% మాత్రమే. అదే పెద్ద సవాలు. వచ్చే పది రోజుల్లో మరో మూడుసార్లు హెలికాప్టర్‌ ఎగిరేలా చేస్తాం" అని ఇంజెన్యుటీ చీఫ్‌ పైలట్‌ హవార్డ్‌ గ్రిప్‌ తెలిపారు.

ఇవీ చదవండి: నాసా రికార్డ్​: అరుణ గ్రహంపై ఎగిరిన హెలికాప్టర్​

ఆవాసం కోసం అన్వేషణ- కుజ గ్రహంపై 'పెర్సెవరెన్స్‌'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.