"అంతర్గత భద్రత, సరిహద్దులో పహారా విషయమై ఆర్మీ ఇంజినీర్ల ప్రధానాధికారి బిలియన్ డాలర్లతో చేపట్టగలిగే ప్రణాళికలు తయారు చేయాలి. వాటిని అమలుపరచాలి"-పెంటగాన్ ప్రకటన
తన నిర్ణయాన్ని సమర్థించుకున్నారు పెంటగాన్ ఛైర్మన్ పాట్రిక్ షనహన్. రక్షణ బడ్జెట్ ముసాయిదాను అమెరికా కాంగ్రెస్లో ప్రవేశపెట్టడానికి కొన్ని గంటల ముందు పాట్రిక్ దీనిపై ప్రకటన చేశారు.
"రహదారుల నిర్మాణానికి, కంచె ఏర్పాటుకు, లైటింగ్ ఏర్పాటు చేసేందుకు ఈ నిధుల్ని మంజూరు చేశాం. అంతర్జాతీయ సరిహద్దు వెంట మాదక ద్రవ్యాల అక్రమ రవాణాను నియంత్రించేందుకు ఈ చర్యలను తీసుకున్నాం" -పాట్రిక్ షనహన్, పెంటగాన్ చీఫ్
మెక్సికో సరిహద్దు గోడ నిర్మాణానికి కాంగ్రెస్ ఆమోదం లభించనందువల్ల జాతీయ అత్యవసర స్థితిని విధించారు ట్రంప్. గోడ నిర్మాణానికి అవసరమైన 8 బిలియన్ డాలర్లు చట్టసభ సభ్యుల ఆమోదం లేకుండా మంజూరయ్యేందుకు ఈ ఎత్తుగడకు తెరతీశారు. ట్రంప్ నిర్ణయానికి ప్రతిపక్ష డెమొక్రాట్లు సహా స్వపక్షమైన రిపబ్లికన్ల ఆమోదమూ లభించలేదు.