గడిచిన పదేళ్ల కాలం(2010-2019) భూమి మీద అత్యంత వేడిగా ఉన్న దశాబ్దిగా నమోదైంది. ఈ విషయాన్ని ఐక్యరాజ్యసమితి వాతావరణ విభాగం ప్రకటించింది. ఈ ప్రకటనను అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ(నాసా), అమెరికా సముద్ర-వాతావరణ విభాగం కూడా ధ్రువీకరించాయి.
2020తో పాటు ఆ తర్వాత కుడా అసాధారణమైన వాతావరణ పరిస్థితులను ఎదుర్కోవాల్సి ఉంటుందని ఐరాస తెలిపింది. 140 ఏళ్లలో 2019 రెండో అత్యంత వేడిగా ఉన్న సంవత్సరమని నాసా, ఎన్ఓఏఏ ప్రకటించాయి.
మానవ తప్పిదాల వల్లే భూమిపై ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరుగుతున్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
ఇదీ చూడండి: 5 కెమెరాలతో షియోమీ నుంచి సూపర్ బడ్జెట్ ఫోన్!