మీ సెల్‌ఫోన్‌ని ఓ చిలుక ఎత్తుకెళ్తే? ఆ సమయంలో మీ సెల్‌ఫోన్ కెమెరా ఆన్‌లోనే ఉండటమే కాకుండా.. అది రికార్డవుతుంటే? చుట్టూ పరిసరాలు డ్రోన్లో చిత్రీకరించినట్లుగా కనిపిస్తాయి కదూ? ఓ వ్యక్తికి సరిగ్గా ఇలాంటి అనుభవమే ఎదురైంది.
సెల్‌తో తుర్రుమన్న చిలుక..
ఓ వ్యక్తి ఫొటోలు తీసుకుంటుండగా అతని మొబైల్‌ను ఓ చిలుక ఎత్తుకెళ్లింది. దీంతో కంగారుపడిన ఆ అతను తన ఫోన్ కోసం ఆ చిలుక వెంట పరుగెత్తాడు. అయితే అది అతనికి దొరక్కుండా చాలా ఎత్తుకు ఎగిరి పారిపోయింది. ఆ ఫోన్ కెమెరా ఆన్‌లో ఉండటంతో పైకి ఎగిరిన చిలుక సిటీ మొత్తాన్ని వీడియో తీసేసింది.!
-
Parrot takes the phone on a fantastic trip. 😳🤯😂🦜 pic.twitter.com/Yjt9IGc124
— Fred Schultz (@fred035schultz) August 24, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">Parrot takes the phone on a fantastic trip. 😳🤯😂🦜 pic.twitter.com/Yjt9IGc124
— Fred Schultz (@fred035schultz) August 24, 2021Parrot takes the phone on a fantastic trip. 😳🤯😂🦜 pic.twitter.com/Yjt9IGc124
— Fred Schultz (@fred035schultz) August 24, 2021
భలే చిలుక..
ఆ చిలుక వేగంగా ఎగురుతుండగా వీధులు, ఇళ్లు, భవనాలు, పరిసర దృశ్యాలు రికార్డయ్యాయి. కొద్దిసేపు ఎగిరిన చిలుక ఓ బాల్కనీ వద్ద ఆగింది. అయితే ప్రజలు దానిని వెంబడించడం వల్ల మళ్లీ ఎగరడం మొదలుపట్టింది. చిలుక తన కంటి చూపుతోనే ఈ వీడియో తీసిందా అన్నట్లున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి ఆ దృశ్యాలు. 9.73 లక్షల వ్యూస్, 7వేల రీట్వీట్‌లతో దూసుకెళ్తోంది ఆ వీడియో. @fred035schultz అనే ట్విట్టర్ యూజర్ షేర్ చేసిన ఈ వీడియోకు 'పారట్ ఫోన్ ట్రిప్' అనే క్యాప్షన్‌ను ఇచ్చారు.
నమ్మలేమంటూ కామెంట్లు..
చిలుక చేసిన పనికి నెటిజన్లు సరదా స్పందిస్తున్నారు. దీనిని 'పర్యావరణ అనుకూల డ్రోన్'గా అభివర్ణిస్తున్నారు. 'ఇదో సరదా ప్రయాణం' అని ఓ వ్యక్తి వ్యాఖ్యానించారు. అయితే కొందరు మాత్రం ఈ వీడియో నకిలీదని అభిప్రాయపడ్డారు.
ఈ వీడియోను నిశితంగా గమనిస్తే ఆ చిలుక రెక్కలు అసాధారణంగా ఉన్నాయని ఒకరు కామెంట్ చేశారు. అంతేగాక చిలుక కదలికలు కృత్రిమంగా ఉన్నాయని.. చుట్టుపక్కల చెట్లపై ఆకులు సహజంగా కదలట్లేదని రాసుకొచ్చారు. ఒకరు 'ఇది 100% యానిమేషన్' అని అన్నారు.
ఇవీ చదవండి: