ప్రపంచవ్యాప్తంగా కొవిడ్ విలయతాండవం కొనసాగుతోంది. ఇప్పటివరకు 5కోట్ల 19 లక్షలకుపైగా వైరస్ కేసులు నమోదయ్యాయి. వారిలో 12లక్షల 82వేల మందికిపైగా కరోనాకు బలయ్యారు. ఇప్పటివరకు 3కోట్ల 64లక్షల మందికిపైగా మహమ్మారిని జయించారు. 74లక్షలకుపైగా యాక్టివ్ కేసులున్నాయి.
- కరోనా కేసుల పరంగా అగ్రస్థానంలో ఉన్న అమెరికాలో ఇప్పటివరకు 1.05కోట్ల కేసులు నమోదయ్యాయి. వారిలో 2.45 లక్షల మందికిపైగా మరణించారు.
- నేపాల్‌లో వైరస్ విజృంభణ కొనసాగుతోంది. ఒక్కరోజులోనే 2,736 మంది కరోనా బారినపడ్డారు. బాధితుల సంఖ్య 2లక్షలకు సమీపించింది. మరో 22 మరణాలతో.. మృతుల సంఖ్య 1,148కి చేరింది.
- పాక్‌లో మరో 1,637 మందికి వైరస్ ఉన్నట్టు తేలింది. ఫలితంగా బాధితుల సంఖ్య 3లక్షల 47వేల 476కు చేరింది. మరో 23 మంది మృతిచెందడం వల్ల.. ప్రాణాలు కోల్పోయిన వారిసంఖ్య 7వేల మార్క్‌కు చేరింది.
కరోనా కేసులు ఇలా..
దేశం | మొత్తం కేసులు | మరణాలు |
అమెరికా | 1,05,73,090 | 2,45,963 |
భారత్ | 86,37,987 | 1,27,636 |
బ్రెజిల్ | 57,01,283 | 1,62,842 |
రష్యా | 18,36,960 | 31,593 |
ఫ్రాన్స్ | 18,29,659 | 42,207 |
స్పెయిన్ | 14,43,997 | 39,756 |
అర్జెంటీనా | 12,62,476 | 34,183 |
బ్రిటన్ | 12,33,775 | 49,770 |
కొలంబియా | 11,56,675 | 33,148 |
ఇటలీ | 9,95,463 | 42,330 |
ఇదీ చదవండి: 'స్పుత్నిక్-వీ వ్యాక్సిన్ 92శాతం ప్రభావవంతం'