ETV Bharat / international

Covid 19 Origin: కరోనా పుట్టుకను తెలుసుకోవటం అసాధ్యమా? - కరోనా వైరస్ మూలాలు

కరోనా మూలాలను(Covid 19 Origin) కనుగొనడం ఎప్పటికీ సాధ్యం కాకపోవచ్చని అమెరికా ఇంటెలిజెన్స్ కమ్యూనిటీ అభిప్రాయపడింది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమాచారంతో ఉపయోగం లేదని పేర్కొంది.

Origins of COVID may never be definitively identified: US Intelligence Community assessment
'కరోనా మూలాలు ఎప్పటికి కొనుగొనలేం!'
author img

By

Published : Aug 28, 2021, 11:46 AM IST

Updated : Aug 29, 2021, 7:18 AM IST

ప్రపంచాన్ని కాకవికలం చేసిన కరోనా వైరస్ మూలాలను(Covid 19 Origin) కనుగొనేందుకు శాస్త్రవేత్తలు ఎంతో ప్రయత్నిస్తున్నాయి. చైనాలోని వుహాన్​ ల్యాబ్(Wuhan Lab) నుంచే ఈ వైరస్ లీక్ అయి ఉంటుందని తొలుత ప్రచారం జరిగింది. అయితే ఈ వాదనను చైనా ఖండించింది. ఇప్పుడు అమెరికా ఇంటెలిజెన్స్ కమ్యూనిటీ-ఐసీ(US Intelligence Community).. కొవిడ్​-19 మూలాలను కనుక్కోవడం ఎప్పటికీ సాధ్యం కాకపోవచ్చని అభిప్రాయపడింది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమాచారంతో వైరస్​ పుట్టుక తెలుసుకోలేమని నివేదికలో పేర్కొంది.

ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్‌ మూలాలపై అమెరికా నిఘా విభాగం స్పష్టతకు రాలేకపోయింది. చైనాలోని వుహాన్‌ ల్యాబ్‌ నుంచే ఈ వైరస్‌ బయటకు వచ్చిందా? సహజంగానే పుట్టిందా? జీవాయుధాన్ని తయారుచేసేందుకే ఈ మహమ్మారిని సృష్టించారా? అన్న విషయాల్లో ఎలాంటి ముగింపునకూ రాలేకపోయింది. అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ ఆదేశాల మేరకు 'కొవిడ్‌-19' మూలాలను కనుగొనేందుకు పరిశోధన సాగించిన 'ద డైరెక్టర్‌ ఆఫ్‌ నేషనల్‌ ఇంటెలిజెన్స్‌'.. శనివారం నివేదికను విడుదల చేసింది.

2019, నవంబరులోనే 'సార్స్‌-కొవ్‌-2' వైరస్‌ చిన్నగా మనుసులకు సోకడం ప్రారంభమైందని, డిసెంబరు నాటికి వుహాన్‌లో ఈ ఇన్‌ఫెక్షన్‌ బాధితుల సంఖ్య అమాంతం పెరగడంతో కొవిడ్‌ వ్యాప్తి గురించి తెలిసిందని నివేదిక పేర్కొంది. అయితే, దీని అసలు మూలం ఎక్కడన్న విషయమై ఇంటెలిజెన్స్‌ కమ్యూనిటీ (ఐసీ) ఏకాభిప్రాయానికి రాలేదని తెలిపింది.

''కరోనా వైరస్‌ను జీవాయుధం కోసం సృష్టించలేదు. ఇది జన్యు ఇంజినీరింగ్‌ సాంకేతికతతో తయారైంది కాకపోవచ్చని చాలా ఏజెన్సీలు అభిప్రాయపడ్డాయి. ఈ రెండింటిలో ఏదోక అభిప్రాయానికి రావడానికి అవసరమైన ఆధారాలు లేవని మరో రెండు ఏజెన్సీలు చెప్పాయి. కొవిడ్‌ ప్రారంభ వ్యాప్తికి ముందు... ఈ వైరస్‌ గురించి చైనా అధికారులకు అవగాహనే లేదని ఐసీ పేర్కొంది. అందుబాటులో ఉన్న నివేదికలు, సమాచారాన్ని పరిశీలించిన తర్వాత... రెండు ప్రధాన పరిణామాలే కొవిడ్‌-19 ఇన్‌ఫెక్షన్‌కు మూలమని ఇంటెలిజెన్స్‌ కమ్యూనిటీ భావిస్తోంది.

1) ఇన్‌ఫెక్షన్‌కు గురైన జంతువు నుంచి వైరస్‌ మనిషికి సోకడం; లేదా కరోనా వైరస్‌ను 99% సరిపోలే ప్రోజెనిటర్‌ వైరస్‌ మనిషికి వ్యాపించి ఉండటం.

2) ప్రయోగశాల సంబంధిత ఘటన ద్వారా వైరస్‌ వ్యాపించడం.

అయితే- జంతువుపై ప్రయోగాలుచేసే క్రమంలో, ప్రయోగశాలలో జరిగిన సంఘటన కారణంగా ఈ వైరస్‌ వ్యాపించి ఉండొచ్చని మరో ఏజెన్సీ అంచనా వేసింది'' అని నివేదికలో ముక్తాయించారు. ఐసీ విశ్లేషణలో ఎన్ని ఏజెన్సీలు పాల్గొన్నాయన్నది మాత్రం ఇంటెలిజెన్స్‌ అధికారులు వెల్లడించలేదు.

శాస్త్రవేత్తలే తేల్చాలి: చైనా

మెరికా ఇంటెలిజెన్స్‌ కమ్యూనిటీ నివేదికలో స్పష్టత కొరవడటం చైనాకు ఊరటనిచ్చింది. ఈ క్రమంలో నివేదికను తప్పు పడుతూ డ్రాగన్‌ అధికారులు వ్యాఖ్యలు చేశారు. ''వైరస్‌ మూలాలు శాస్త్ర పరిధిలోని వైజ్ఞానిక అంశం. దీన్ని తేల్చాల్సింది శాస్త్రవేత్తలే తప్ప ఇంటెలిజెన్స్‌ నిపుణులు కాదు'' అని అమెరికాలోని చైనా రాయబార కార్యాలయం పేర్కొంది.

మూలాలను కనుగొంటాం: బైడెన్‌

నివేదికపై బైడెన్‌ స్పందించారు. ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో మరణాలకు, వేదనకు కారణమైన కరోనా మహమ్మారి మూలాలను కనుగొనేందుకు తమ ప్రభుత్వం అన్ని విధాలా కృషి చేస్తుందని, తద్వారా భవిష్యత్తులో ఇలాంటివి తలెత్తకుండా జాగ్రత్తపడేందుకు అవకాశం ఉంటుందని చెప్పారు.

''మహమ్మారి మూలాలకు సంబంధించిన సమాచారం చైనాలోనే ఉంది. ఆ సమాచారం అంతర్జాతీయ పరిశోధకులు, ప్రజారోగ్య అధికారుల చేతికి అందకుండా చైనా అధికారులు మొదట్నుంచీ అడ్డుకుంటూనే ఉన్నారు. ఇప్పటికీ ఆ దేశం పారదర్శకంగా వ్యవహరించడం లేదు. అడిగిన సమాచారం ఇవ్వడం లేదు'' అని బైడెన్‌ పేర్కొన్నారు.

ఇదీ చూడండి: US Airstrike: అమెరికా ప్రతీకారం- ఐసిస్ స్థావరాలపై డ్రోన్​ దాడులు!

Last Updated : Aug 29, 2021, 7:18 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.