ETV Bharat / international

24 గంటల్లో లక్ష కేసులు- గరిష్ఠ పెరుగుదల ఇదే - కొవిడ్​-19 తాజా వార్తలు

కరోనా వైరస్​ మరింత తీవ్రంగా వ్యాపిస్తోంది. గత 24 గంటల్లో ప్రపంచవ్యాప్తంగా లక్ష పాజిటివ్​ కేసులు నమోదయ్యాయి. 24 గంటల్లో ఇంత పెద్ద స్థాయిలో కేసులు నమోదుకావడం ఇదే మొదటిసారి. చైనాలో కరోనా వైరస్‌ మరోసారి విజృంభిస్తోంది. జిలిన్‌ రాష్ట్రంలోని జిలిన్‌, షులాన్‌ పట్టణాల్లో కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. దీనితో వుహాన్‌ తరహా లాక్‌డౌన్‌ను విధించారు.

One lakh corona cases registered in a single day
ఒక్కరోజే లక్ష కరోనా కేసులు నమోదు
author img

By

Published : May 22, 2020, 6:44 AM IST

Updated : May 22, 2020, 6:55 AM IST

కరోనా కోరల్లో నుంచి మానవాళి ఇప్పుడప్పుడే బయటపడే సంకేతాలు కనిపించడం లేదు. నానాటికీ ఈ మహమ్మారి మరింత ప్రబలంగా వ్యాప్తి చెందుతోంది. ప్రపంచవ్యాప్తంగా మంగళవారం నుంచి బుధవారం మధ్య 24 గంటల్లో ఏకంగా లక్షకుపైగా కేసులు నమోదయ్యాయి. అమెరికా, రష్యాల్లో ప్రతిరోజు వేల సంఖ్యలో కొత్త కేసులు వెలుగుచూస్తున్నాయి. బ్రెజిల్‌, మెక్సికో, బ్రిటన్‌ తదితర దేశాల్లోనూ పరిస్థితులు విషమంగానే ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు వైరస్‌ బారిన పడ్డవారి సంఖ్య 51.32 లక్షలు దాటింది. అందులో 20 లక్షలమందికిపైగా కోలుకున్నారు. అమెరికాలో కరోనా సోకిన వారి సంఖ్య 16 లక్షలు దాటింది.

ప్రపంచవ్యాప్తంగా 24 గంటల వ్యవధిలో 1.06 లక్షల కేసులు నమోదయ్యాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) డైరెక్టర్‌ జనరల్‌ టెడ్రోస్‌ అధనామ్‌ వెల్లడించారు. ఇప్పటివరకు ఒక్కరోజులో గరిష్ఠ పెరుగుదల ఇదేనని తెలిపారు.

బ్రిటన్‌లో 36 వేలకుపైగా మరణాలు

బ్రిటన్‌లో కరోనా ప్రతాపం కొనసాగుతోంది. అక్కడ మరో 338 మంది ప్రాణాలను వైరస్‌ బలి తీసుకుంది. దీంతో బ్రిటన్‌లో మొత్తం మృతుల సంఖ్య 36 వేలు దాటింది. రష్యాలో కొత్తగా 8,849 కేసులు వెలుగుచూశాయి.

దక్షిణాఫ్రికాలో 2 రోజుల పసికందు మృతి

కొవిడ్‌తో దక్షిణాఫ్రికాలో రెండు రోజుల పసికందు మరణించింది. నెలలు నిండకుండానే పుట్టిన ఆ శిశువులో శ్వాస సంబంధిత సమస్యలు తలెత్తడంతో వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందించారు. మృతిచెందిన అనంతరం పరీక్ష చేయగా కొవిడ్‌ ఉన్నట్లు తేలింది.

చైనాలో రూపు మార్చుకుని మళ్లీ..

చైనాలో కరోనా వైరస్‌ మరోసారి పంజా విసిరింది. జిలిన్‌ ప్రావిన్స్‌లోని జిలిన్‌, షులాన్‌ పట్టణాల్లో కరోనా కేసులు పెరిగిపోవడంతో వుహాన్‌ తరహా లాక్‌డౌన్‌ను విధించారు. ఈ పట్టణాల్లో వ్యాపించింది జన్యు మార్పులు చోటు చేసుకొన్న కరోనా వైరస్‌గా భావిస్తున్నారు. ఈ మార్పుల వల్ల వుహాన్‌లో కంటే ఈ వైరస్‌ ప్రమాదకరంగా మారిందని డాక్టర్‌ క్యూహైబో తెలిపారు. ఇక జిలిన్‌ పట్టణంలో వుహాన్‌ తరహా లాక్‌డౌన్‌ విధించారు. ఇక్కడ 130 కేసులు వచ్చాయి.

వుహాన్‌లో కలకలం

కరోనా పుట్టుకకు కేంద్రంగా నిలిచిన చైనాలోని వుహాన్‌ నగరంలో కొవిడ్‌ లక్షణాలు కనిపించనప్పటికీ పాజిటివ్‌గా తేలుతున్నవారి(అసింప్టమాటిక్‌) సంఖ్య పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా చైనావ్యాప్తంగా 31 అసింప్టమాటిక్‌ కేసులు వెలుగుచూడగా.. అందులో 28 ఒక్క వుహాన్‌లోనివే కావడం గమనార్హం.

CORONA VIRUS UPDATES WORLDWIDE
ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్న వైనం

ఇదీ చూడండి: అతిపెద్ద శ్మశానంలో ఎక్కడ చూసినా కరోనా మృతులే!

Last Updated : May 22, 2020, 6:55 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.