ETV Bharat / international

అక్కడ ప్రతి ఐదుగురు ఖైదీల్లో ఒకరికి కరోనా!

అగ్రరాజ్యంలో కొవిడ్​ ఉద్ధృతి ఏమాత్రం తగ్గడం లేదు. ఆ దేశంలోని జైళ్లలో ప్రతి ఐదు మంది ఖైదీల్లో ఒకరు కరోనా బారినపడుతున్నారు. కొన్ని రాష్ట్రాల్లో సగం మందికిపైగా ఖైదీల్లో వైరస్​ ఉన్నట్లు తెలుస్తోంది.

One in Five state and federal prisoners in the US has had COVID-19
అమెరికా జైళ్లలో ప్రతి ఐదుగురు ఖైదీల్లో ఒకరికి కరోనా!
author img

By

Published : Dec 19, 2020, 4:00 PM IST

అమెరికాలో కరోనా మహమ్మారి వీర విహారం చేస్తోంది. అగ్రరాజ్యంలో వివిధ జైళ్లలోని.. ప్రతి ఐదుగురు ఖైదీల్లో ఒకరు వైరస్​ బారినపడ్డారని సమాచారం. సాధారణ జనాభాతో పోలిస్తే ఈ సంఖ్య నాలుగు రెట్లు అధికంగా ఉండటం ఆందోళన కలిగిస్తోంది. మరికొన్ని రాష్ట్రాల్లో ఆయా బందీఖానాల్లో సుమారు సగానికిపైగా ఖైదీలకు కొవిడ్​-19 సోకినట్టు ఓ సర్వేలో తేలింది.

యూఎస్​ జైళ్లలో ఇప్పటివరకు సుమారు 2లక్షల 75వేల మందికిపైగా ఖైదీలు కరోనా బారినపడ్డారు. 1,700 మందికిపైగా చనిపోయారు. ఏప్రిల్​, ఆగస్టు నెలల్లో కంటే గత వారం రోజుల్లోనే అధిక స్థాయిలో కొత్త కేసులు నమోదయ్యాయని అధికారులు వెల్లడించారు. అయితే.. కొవిడ్​ మార్గదర్శకాలను సక్రమంగా పాటించకపోవడం వల్లే.. ఈ స్థాయిలో విజృంభిస్తోందని ఓ అధికారి పేర్కొన్నారు.

ఆ దేశంలో శుక్రవారం ఒక్కరోజే 2.54 లక్షల కరోనా కేసులు వెలుగుచూశాయి. మొత్తం బాధితుల సంఖ్య 1.78 కోట్లు దాటింది. మరో 2,794 మంది కొవిడ్​ కారణంగా ప్రాణాలు కోల్పోయారు. దీంతో మరణాల సంఖ్య 3.20 లక్షలకు ఎగబాకింది. అయితే.. పెరుగుతున్న వైరస్​ కేసులను నియంత్రించేందుకు ఇటీవలే వ్యాక్సినేషన్​ను ప్రారంభించింది అమెరికా.

ఇదీ చదవండి: ప్రపంచ దేశాలన్నింటికీ కరోనా టీకా​ అవసరమే

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.