ప్రపంచవ్యాప్తంగా ఏటా వందకోట్ల మంది చిన్నారులు శారీరకంగా, మానసికంగా, లైంగికంగా హింసకు గురవుతున్నారని ఐక్యరాజ్యసమితి ఓ నివేదికలో తెలిపింది. చిన్నారులు వీటి బారినపడకుండా రక్షణ కల్పించడంలో ఆయా దేశాలు విఫలమవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేసింది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో విధించిన లాక్డౌన్ వంటి ఆంక్షల కారణంగా హింస మరింత ఎక్కువైనట్లు చెబుతున్నారు నిపుణులు. చిన్నారుల్లో అత్యధికులు... హింసకు పాల్పడే వారితో ఎక్కువ సమయం గడపాల్సి రావడమే ఇందుకు కారణమని వివరించారు.
చట్టాలు అమల్లో ఉన్నా..
బాలల రక్షణకు అంతర్జాతీయంగా 88 శాతం దేశాల్లో చట్టాలున్నప్పటికీ.. వీటిల్లో సగానికంటే తక్కువగా 47 శాతం దేశాలు మాత్రమే కఠినంగా అమలు చేస్తున్నట్లు నివేదిక తెలిపింది. పిల్లలకు రక్షణ కల్పించడంలో మిగతా దేశాలు పూర్తిగా విఫలమవుతున్నాయని... ఫలితంగా ఏటా వందకోట్ల మంది చిన్నారులపై ఈ ప్రభావం పడుతుందని స్పష్టం చేసింది.
ఇదీ చదవండి: రోజూ వ్యాయామం చేయండి.. ఆయుష్షు పెంచుకోండి