ETV Bharat / international

నరేంద్రుడి పాలనకు ఎన్​ఆర్​ఐలు ఫిదా

విదేశాల్లో నివసిస్తున్న భారతీయుల్లోనూ 'నమో' జపమే వినపడుతోంది. సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయం సాధించి రెండోసారి ప్రధాని బాధ్యతలు చేపడుతున్న మోదీకి అమెరికాలోని 93.9 శాతం ఎన్​ఆర్​ఐలు మద్దతు పలికినట్టు ఓ సర్వే తెలిపింది. మోదీ ప్రభుత్వంతో భారత్​ అభివృద్ధి వైపు పరుగులు తీస్తోందని అత్యధిక మంది ఎన్​ఆర్​ఐలు నమ్ముత్తున్నట్టు సర్వే వెల్లడించింది.

నరేంద్రుడి పాలనకు ఎన్​ఆర్​ఐలు ఫిదా
author img

By

Published : May 29, 2019, 11:52 AM IST

భారత ప్రధానమంత్రిగా రెండోసారి నరేంద్ర మోదీ బాధ్యతలు చేపట్టడంపై అమెరికాలోని ఎన్​ఆర్​ఐలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 93.9 శాతం ఎన్​ఆర్​ఐలు నరేంద్రుడికే మద్దతు పలికినట్టు అమెరికా ఆధారిత స్వచ్ఛంద సంస్థ ఫౌండేషన్​ ఫర్​ ఇండియా అండ్​ ఇండియన్​ డయాస్పొరా స్టడీస్​(ఎఫ్​ఐఐడీఎస్​) సర్వే వెల్లడించింది.

విదేశాంగ శాఖపై ఎన్​ఆర్​ఐలు ప్రశంసల వర్షం కురిపించారు. వీసాలు, పాస్​పోర్టుల జారీకి పట్టే సమయం ఎంతో తగ్గిందని హర్షం వ్యక్తం చేశారు. సమస్యలను పరిష్కరించడానికి విదేశాంగ శాఖ చేపట్టిన చర్యలతో 95.5శాతం మంది సంతృప్తి చెందినట్టు సర్వే తెలిపింది.

సర్వేలోని మరిన్ని అంశాలు...

  • మోదీ ప్రభుత్వం రోడ్లు, రవాణ, విద్యుత్​ విభాగాల్లో మెరుగైన పనితీరు కనబరిచిందని 93 శాతం మంది నమ్ముతున్నారు.
  • ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు బాగున్నాయని 80శాతం ఎన్​ఆర్​ఐలు అభిప్రాయపడ్డారు.
  • ప్రభుత్వ పథకాల్లో స్వచ్ఛ భారత్​కు (86.9 శాతం) అత్యధిక మద్దతు లభించింది. మేక్​ ఇన్​ ఇండియా(84.6శాతం), డిజిటల్​ ఇండియా(84.3 శాతం) ఆ తర్వాతి స్థానాల్లో నిలిచాయి.
  • మోదీ పాలనలో దేశ భద్రత బలపడిందని 90.3 శాతం మంది అభిప్రాయపడ్డారు.
  • ఉగ్రవాదంపై మోదీ ప్రభుత్వ వైఖరికి 92 శాతం ఎన్​ఆర్​ఐల మద్దతు లభించింది.
  • 63.3 శాతం మంది 2019 సార్వత్రిక ఎన్నికల్లో రామ జన్మభూమి, శబరిమల అంశాలు కీలకంగా మారతాయని భావించారు.
  • నోట్లరద్దు, జీఎస్​టీలు భారత దేశానికి దీర్ఘకాలంలో ఉపయోగపడతాయని 81 శాతం ఎన్​ఆర్​ఐలు విశ్వసించారు.
  • అభివృద్ధి మార్గంలో భారత్​ పరుగులు పెడుతోందని 90.3శాతం మంది అభిప్రాయపడ్డారు.

ఇదీ చూడండి- ఆ గోడపైనే నా డ్రీమ్​ గర్ల్​ ఉండేది: ఆర్జీవీ

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.