ETV Bharat / international

న్యూయార్క్​పై కరోనా పంజా- 5వేలకుపైగా పాజిటివ్ కేసులు

author img

By

Published : Mar 22, 2020, 1:00 PM IST

అమెరికా వాణిజ్య కేంద్రమైన న్యూయార్క్ నగరంపై కరోనా వైరస్ పంజా విసురుతోంది. నగరంలో ఇప్పటివరకు 43మంది ప్రాణాలు కోల్పోయారు. 5 వేలమందికిపైగా కరోనా సోకింది. అదే సమయంలో అమెరికావ్యాప్తంగా 26,500 మందికిపైగా వైరస్ పాజిటివ్​గా తేలింది. మొత్తంగా 349మంది మరణించారు. పరిస్థితి తీవ్రత దృష్ట్యా ప్రజలు ఇళ్లల్లో ఉండి ప్రాణాలు కాపాడుకోవాలని సూచించారు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.

corona
న్యూయార్క్​పై కరోనా పంజా- 5వేలకుపైగా పాజిటివ్ కేసులు

అమెరికా న్యూయార్క్ నగరం ప్రస్తుతం కరోనా వైరస్ కేంద్రస్థానంగా మారింది. నగరంలో ఇప్పటివరకు 5వేలకు పైగా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 43మంది ప్రాణాలు కోల్పోయారు.

న్యూయార్క్ రాష్ట్రంలో వైరస్ చేరుకున్న వారి సంఖ్య 7వేలకు చేరుకోనుందని అధికారులు స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా కఠిన నిబంధనలు అమలు చేస్తున్నట్లు ప్రకటించారు గవర్నర్ ఆండ్ర్యూ క్యూమో. అనవసరమైన పనులు చెయ్యకుండా ఉండటం సహా 10 అంశాలతో కూడిన ఆంక్షలను అమలుచేయనున్నట్లు తెలిపారు.

అమెరికావ్యాప్తంగా 349మంది..

అమెరికాలో ఇప్పటివరకు 26, 500మందికి పైగా కరోనా సోకింది. కేవలం ఒక్కరోజు వ్యవధిలోనే 7వేలమందికిపైగా పాజిటివ్​గా తేలింది. గత 24 గంటల్లో 80మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తంగా మృతుల సంఖ్య 340కి చేరింది.

ఇళ్లల్లో ఉండి ప్రాణాలు కాపాడుకోండి..

ప్రజలు ఇళ్లనుంచి బయటకు రాకూడదని సూచించారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. అలా అయితేనే ప్రాణాలు కాపాడుకోగలమని వ్యాఖ్యానించారు.

న్యూజెర్సీలో ఆంక్షలు..

కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు జన సంచారంపై న్యూజెర్సీ రాష్ట్ర అధికారులు ఆంక్షలు విధించారు. ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాకూడదని సూచించారు.

ఉపాధ్యక్షుడు పెన్స్​కు కరోనా నెగిటివ్..

అమెరికా ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్, ఆయన సతీమణి కరెన్​కు కరోనా లేదని నిర్ధరణ అయింది. పెన్స్ కార్యాలయ సిబ్బంది ఒకరికి కరోనా ఉన్నట్లు తేలిన కారణంగా పెన్స్ దంపతులు స్వీయ నిర్బంధంలోకి వెళ్లి, వైద్య పరీక్షలు చేయించుకున్నారు. పరీక్షల్లో వారికి వైరస్ సోకలేదని తేలింది.

ఇదీ చూడండి: ప్రపంచవ్యాప్తంగా 13 వేలు దాటిన కరోనా మరణాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.