ETV Bharat / international

కరోనా కల్లోలం- 71 శాతం పెరిగిన కేసులు - undefined

New COVID-19 Cases: ప్రపంచవ్యాప్తంగా ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి పెరుగుతోంది. వారం వ్యవధిలోనే 71 శాతం కొవిడ్ కేసులు పెరిగడం ఆందోళన కలిగిస్తోంది. డిసెంబర్ 27-జనవరి 2 మధ్య అంతకుముందు వారంతో పోలిస్తే ఈ మేరకు నమోదైనట్లు డబ్ల్యూహెచ్​ఓ తెలిపింది.

New COVID-19 Cases
కరోనా
author img

By

Published : Jan 7, 2022, 5:57 AM IST

Updated : Jan 7, 2022, 11:46 AM IST

New COVID-19 Cases: ప్రపంచవ్యాప్తంగా కరోనా కల్లోలం కొనసాగుతోంది. గత అక్టోబర్​ నుంచి వివిధ దేశాల్లో కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. వారం వ్యవధిలోనే (డిసెంబర్ 27-జనవరి 2) 71 శాతం కొవిడ్ కేసులు పెరిగాయని డబ్ల్యూహెచ్​ఓ తెలిపింది. అయితే.. వైరస్ బారినపడిన వారి మరణాల సంఖ్య మాత్రం 10 శాతం తగ్గాయని వెల్లడించింది. ఈ వారం ప్రపంచం మొత్తం 95 లక్షల కరోనా కేసులు నమోదు కాగా.. 41,000 మంది మరణించారు.

అమెరికాలో గతంతో పోలిస్తే ఈ వారం కేసులు అత్యధికంగా 100 శాతం పెరిగాయని డబ్ల్యూహెచ్​ఓ తెలిపింది. ఈశాన్య ఆసియా ప్రాంతం 78 శాతం, యూరప్ 65 శాతం, అత్యల్పంగా ఆఫ్రికాలో 7 శాతం పెరిగాయని పేర్కొంది.

దక్షిణాసియాలో ఇండియా తర్వాత బంగ్లాదేశ్​లో కేసుల పెరుగుదల 48 శాతం, మాల్దీవులు 31 శాతం, థాయ్​లాండ్ 6 శాతం, శ్రీలంక 8 శాతంగా ఉంది. భారత్​లో మాత్రం గత వారంతో పోలిస్తే ఈ వారం 120 శాతం కేసులు పెరిగాయి. మరణాల్లో భారత్​లో 8 శాతం తగ్గుదల నమోదు కాగా.. థాయ్​లాండ్​లో 31 శాతంగా ఉంది.

ఇదీ చదవండి: కరోనా ధాటికి అమెరికా విలవిల.. ఫ్రాన్స్​లో 3లక్షల కొత్త కేసులు

Last Updated : Jan 7, 2022, 11:46 AM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.