ETV Bharat / international

క్యాపిటల్​ భవనం వీడనున్న నేషనల్ గార్డ్స్​! - యూఎస్​ క్యాపిటల్​

అమెరికాలోని క్యాపిటల్​ భవనం వద్ద ఉన్న భద్రతను సడలిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఉన్న నేషనల్​ గార్డ్స్​ స్థానంలో మళ్లీ స్థానిక పోలీసులకు భద్రతా బాధ్యతలను అప్పగించనుంది అక్కడి ప్రభుత్వం.

us capitol national guard, క్యాపిటల్​ భవనం
యూఎస్​ క్యాపిటల్
author img

By

Published : May 24, 2021, 10:13 AM IST

యూఎస్​ క్యాపిటల్​ భవనం వద్ద గత దాదాపు ఐదు నెలలుగా పహారా కాస్తున్న నేషనల్​ గార్డ్స్​ దళాలు సోమవారం ఆ ప్రాంతం నుంచి నిష్క్రమిస్తున్నట్లు సమాచారం. క్యాపిటల్​ భవనం వద్ద విధులు నిర్వహిస్తున్న 2,149 మంది నేషనల్​ గార్డ్స్​ను ఆ ప్రాంతంలో కొనసాగించాలని తమకు ఎలాంటి ఆదేశాలు రాలేదని అమెరికా రక్షణ విభాగమైన పెంటగాన్​ గత వారం వెల్లడించింది.

నేషనల్​ గార్డ్స్​ వీడిన అనంతరం ఆ ప్రాంతం స్థానిక పోలీసుల అధీనంలోకి వస్తుందని అధికార వర్గాలు వెల్లడించాయి. అయితే భద్రత దృష్ట్యా భవనాన్ని మరికొంత కాలం సందర్శకులకు అనుమతించమని స్పష్టం చేశాయి.

ఇప్పటికే క్యాపిటల్​ భవనం వద్ద భద్రతను పెంచేందుకు ప్రభుత్వం 1.9 బిలియన్ డాలర్లను కేటాయించింది. ఆ ఘటనపై విచారణకు స్వతంత్ర కమిషన్​ కూడా ఏర్పాటైంది.

ఇదీ చదవండి : 'మహమ్మారి మనతోనే ఉందనేందుకు అది ఓ హెచ్చరిక'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.