ETV Bharat / international

చైనా వద్దు.. భారతే‌ ముద్దంటున్న అమెరికన్లు! - ఆస్ట్రేలియా లోని ఇన్​స్టిట్యూట్​ సర్వే

భారత్​ - చైనా దేశాల మధ్య వివాదాల్లో ఎక్కువ మంది అమెరికన్​లు భారత్​కే తమ మద్దతును ప్రకటిస్తున్నట్లు ఇటీవల నిర్వహించిన ఓ సర్వేలో వెల్లడైంది. జూన్​ 15 న ఈ రెండు దేశాల మధ్య ఘర్షణలు తలెత్తిన నేపథ్యంలో ఆస్ట్రేలియాకు చెందిన లోవీ ఇన్​స్టిట్యూట్​ సర్వే చేపట్టగా.. అందులో ఈ విషయాలు బహిర్గతమయ్యాయి.

Most of US people are supported to India than china: Australian Survey
చైనా వద్దు.. భారత్‌ ముద్దు: అమెరికా ప్రజలు
author img

By

Published : Jul 31, 2020, 9:51 PM IST

భారత్‌ - చైనా సైనిక, ఆర్థిక వివాదాల్లో భారత్‌కే తమ మద్దతు ఉంటుందని ఎక్కువమంది అమెరికన్లు కోరుకుంటున్నట్లు ఓ సర్వేలో తేలింది. ఆస్ట్రేలియాకు చెందిన లోవీ ఇన్‌స్టిట్యూట్ చేపట్టిన సర్వేలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. ‌జులై 7న చేపట్టిన ఈ సర్వేలో 1,012 మంది అగ్రరాజ్య పౌరులు భాగస్వాములు అయ్యారు.

ఆసియాలో అతిపెద్ద రెండు దేశాల మధ్య సైనిక వివాదం తలెత్తితే 63.5 శాతం, ఆర్థిక వివాదమైతే 60.6 శాతం మంది ఎవ్వరికీ మద్దతు ఇవ్వకూడదని అన్నారు. అయితే చైనాతో పోలిస్తే ప్రత్యేకంగా భారత్‌కు మద్దతిస్తున్నవారి సంఖ్య భారీగా ఉందని సర్వే తెలిపింది.

భారత్​కు అండగా..

'భారత్‌, చైనా మధ్య సైనిక వివాదం తలెత్తితే 32.6 శాతం మంది అమెరికా పౌరులు.. భారత్‌కే అండగా నిలవాలని కోరుకున్నారు. 3.8 శాతం మంది మాత్రమే చైనాకు మద్దతుగా నిలిచారు. ఆర్థిక వివాదమైతే 36.3 శాతం మంది దిల్లీకి, 3.1 శాతం మంది బీజింగ్‌కు అగ్రరాజ్యం మద్దతు ఇవ్వాలని ఓటేశారు' అని పేర్కొంది.

కారణాలివేనా.?

సరిహద్దుల అంశంలో అన్ని పొరుగు దేశాలతో చైనాకు వివాదాలు ఉండటం, హాంకాంగ్‌ స్వేచ్ఛాహరణ, తైవాన్‌పై ఒత్తిడి కారణంగా అమెరికన్లు భారత్‌ వైపు చూపుతున్నారని సర్వే తెలిపింది. చైనాతో అనేక అంశాల్లో భారత్‌, అమెరికా అధికారులకు సవాళ్లు ఎదురవ్వడం వల్ల వారు భారతీయులపై సానుభూతి చూపిస్తున్నారని వెల్లడించింది.

లద్దాఖ్‌ సమీపంలోని గల్వాన్‌లో జూన్‌ 15న భారత్‌, చైనా సైనికుల మధ్య భారీ ఘర్షణ తలెత్తింది. ఈ ఉద్రిక్తతల నేపథ్యంలో లోవీ ఇన్‌స్టిట్యూట్‌ ఈ సర్వే నిర్వహించింది.

ఇదీ చదవండి: అమెరికాకు చైనా షాక్​- సొంత దిక్సూచీ వ్యవస్థ సిద్ధం!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.